రేర్ ఫీట్‌తో చరిత్ర సృష్టించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్

gautamiputra satakarni historical record on youtube

Balayya’s 100th film Gautamiputra Satakarni has created a historical record on youtube by getting huge likes.

ఓవైపు బాలయ్య తన ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాక్సాఫీస్ వద్ద ఓ ఊపు ఊపేస్తుంటే.. మరోవైపు ఈ మూవీ ట్రైలర్ ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతవరకు ఏ తెలుగు సినిమా ట్రైలర్‌‌కి సాధ్యం కాని ఫీట్‌ని తన సొంతం చేసుకుని.. చరిత్ర సృష్టించింది.

యూట్యూబ్‌లో ఇప్పటివరకు 7.2 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్‌కి 1 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. టాలీవుడ్ సినిమా ట్రైలర్లలో ఇప్పటివరకు ఏ ఒక్కదానికి ఆ స్థాయి లైక్స్ రాలేదు. విజువల్ వండర్‌గా ఉన్న ఈ ట్రైలర్ ఆకట్టుకోవడంతో.. నెటిజన్లు ఇప్పటికీ దీన్ని వీక్షిస్తూనే ఉన్నారని, అందుకే అత్యధిక వ్యూస్ రావడంతోపాటు లక్షకుపైగా లైక్స్ వచ్చాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రేర్ ఫీట్ సాధించిన తొలి హీరోగా బాలయ్య తన ఖాతాలో ఓ హిస్టారికల్ రికార్డ్ జమ చేసుకున్నారన్నమాట.

ఇదిలావుండగా.. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంగళవారం వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకుపైనే (షేర్) వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. యూఎస్‌తోపాటు ఇంకా చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారని, టోటల్ రన్‌టైం వరకు ప్రతిఒక్కరికి ఈ చిత్రం భారీ లాభాలు తెచ్చిపెడుతుందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

Leave a comment