A Hyderabadi drunken girl create ruckus at Banjarahills after met an accident. Read below articles to know more details.
‘నన్ను తాగొద్దు.. తాగితే ఆరోగ్యం పాడైపోతుంది.. టోటల్‌గా నాశనం అయిపోతావు’ అని నేరుగా మద్యం బాటిల్ మీదే ఓ హెచ్చరిక రాసి వుంటుంది. అయినా.. వాటిని మద్యపాన ప్రియులు అస్సలు పట్టించుకోరు. తాగామా.. తందనాలాడామా.. పడుకున్నామా.. అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కేవలం పురుషులు మాత్రమే కాదండోయ్.. మహిళలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు పీకలదాకా తాగుతున్నారు. అంతటితో ఆగకుండా.. రోడ్డుపై నానాహంగామా చేస్తున్నారు. కొందరైతే.. సల్మాన్ ఖాన్ దారిలో నడుస్తూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి అలాంటి రచ్చే చేశారు. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఆ అమ్మడు.. రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ బంజరాహిల్స్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సోమాజీగూడకు చెందిన 21 ఏళ్ల ఓ యువతి.. బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు కాలేజీలో బీబీఏ చదువుతుంది. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో స్నేహితురాలితో కలిసి పార్టీకి వెళ్లింది. అక్కడ ఈ అమ్మడు పీకలదాకా మద్యం తాగింది. పార్టీ పూర్తయ్యాక.. కారులో ఇంటికి తిరుగు పయనమైంది. బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న కారుతోపాటు ఓ క్యాబ్‌ను ఢీకొట్టింది. ఓ డ్రైవర్ నిలిపేందుకు ప్రయత్నించబోగా.. కారులోంచి దిగిన యువతి అతనిపైకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆమెకి శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా.. అతిగా మద్యం తాగినట్లు (దాదాపు 161 బీఏసీ) తేలింది.
దీంతో.. ఆ యువతిపై ఐపీసీ సెక్షన్ 279, 185ల కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆమె తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.