చిరు ‘రాంగ్’ అని నిరూపించిన చెర్రీ.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్

chiranjeevi impressed with charan sukumar movie story

Ram Charan proved his father Chiranjeevi judgement wrong in selecting Dhruva movie. Now he impressed by selecting Sukumar’s story for his next movie.

తమ తనయుడు ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని తండ్రులు కోరుకుంటారు. ఆ దిశగా రకరకాల ఆలోచనలు చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు నిత్యం పై స్థాయిలోనే ఉండాలనే భావనతో.. ఇప్పటికీ అన్నింటిలో జోక్యం చేస్తున్నారు. వ్యక్తిగత వ్యవహారాల నుంచి సినిమాల ఎంపిక విషయాల వరకు ఆయన హ్యాండ్ కచ్చితంగా ఉంటుంది. కానీ.. ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి తప్పని చరణ్ నిరూపించాడు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? ‘ధృవ’ సినిమా ఎంపికలో.

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’ని తెలుగులో ‘ధృవ’గా రీమేక్ చేద్దామని చరణ్ డిసైడ్ అయినప్పుడు.. చిరంజీవి వ్యతిరేకించాడట. హీరో డౌన్‌ అయి, విలన్‌ పైన వుంటే తెలుగు వారు అంగీకరించరని ఆయన అన్నాడట. కానీ.. తండ్రి మాటలు పట్టించుకోకుండా చరణ్ గట్ ఫీలింగ్‌తో ఆ సినిమా చేశాడు. ఘనవిజయం సాధించి.. చిరు జడ్జిమెంట్ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా చరణ్ ఓ ప్రయోగాత్మక సినిమా చేసి హిట్ అందుకోవడంతో.. చిరు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతేకాదు.. కథల ఎంపిక విషయంలో చెర్రీ తీసుకుంటున్న జడ్జిమెంట్ సరైనదేనని చిరులో నమ్మకం పెరిగిపోయింది. అందుకే.. సుకుమార్‌తో చేస్తున్న మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ విషయంలో ఆయన ఏమాత్రం జోక్యం చేసుకోలేదని తెలిసింది. అంతేకాదు.. ఈ సినిమా స్టోరీ విని ఆయన ఫ్లాట్ అయిపోయాడట.

కథ ప్రకారం.. ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపమున్న పాత్ర (చెవిటివాడిగా) చేయబోతున్నాడు. ఈ పాత్ర చుట్టూ డిఫరెంట్ స్టోరీని రెడీ చేశాడు సుక్కూ. ఈ కథ విని చరణ్ వెంటనే ఓకే అన్నాడు కానీ.. చిరంజీవి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని టెన్షన్ ఆ ఇద్దరూ పడ్డారట. అయితే.. చిరు కూడా ఈ కథపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ‘ఎప్పుడెప్పుడు వస్తుందా?’ అని ఆత్రుతగా వుందంటూ చెప్పాడట. దీంతో.. సుక్కు, చెర్రీలో కాన్ఫిడెన్స్ పదింతలు అయ్యిందట. ఈ సినిమాని జనవరి 30న లాంచ్ చేసి.. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఆరునెలల్లో ముగించి.. ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Leave a comment