Finally, Chiranjeevi opens up on Puri Jagannadh’s ‘Auto Johnny’ movie which was discussed before ‘Khaidi No 150’.
‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చేయడానికి ముందు మెగాస్టార్ చిరంజీవి ఎందరో దర్శకులతో చర్చలు జరిపాడు. తన రీఎంట్రీ కోసం సరైన కథని, దర్శకుడిని ఎంపిక చేసే పనిలో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్‌తో కలవడం, ‘ఆటో జానీ’ సినిమా దాదాపు ఓకే అవ్వడం జరిగింది. అయితే.. సెకండాఫ్ బాగోలేదని, దాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకుని రమ్మని చిరు అతనికి చెప్పారు. అంతే.. పూరీ అటునుంచే అటే వెళ్లిపోయాడు. తనకు ఆల్రెడీ ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల.. ఆ స్టోరీని డెవలప్ చేయలేకపోయాడు. మళ్ళీ చిరుని కలవలేకపోయాడు. దీంతో.. పూరీ తన ప్రాజెక్టులతో బిజీ అవ్వగా.. చిరు 150వ సినిమా కోసం వినాయక్ సీన్‌లోకి ఎంటరవ్వడం జరిగింది. ఆ సినిమా రిలీజై.. రికార్డుల మోత మోగించేస్తోంది.
అంతా బాగానే ఉంది కానీ.. ‘ఆటోజాని’ సినిమా ఉంటుందా? లేదా? అనే ప్రశ్న మరోసారి తెరమీదకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైందన్న విషయం మళ్ళీ చర్చకు దారితీసింది. ఇప్పుడు ఇన్నాళ్లకి చిరు దానిపై క్టారిటీ ఇచ్చారు. తన ‘ఖైదీ’ సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా వరుసగా చిరు ఇంటర్వ్యూలు ఇస్తుండగా.. ఆయనకి ‘ఆటోజానీ’కి సంబందించిన ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఆయన దానిపై స్పందించారు. ఆ సినిమా డ్రాప్ అవ్వలేదని.. పూరికి సెకండ్ హాఫ్ నచ్చలేదని అప్పుడే చెప్పానని చిరు అన్నారు. ఇప్పుడు తనను ‘ఖైదీ’లో చూశాడు కాబట్టి.. ఎలాంటి మార్పులు తాను కోరుకుంటున్నానో పూరీకి అర్థమై ఉంటుందని, తనకు నప్పే విధంగా మార్పులు చేసి ఆ స్ర్కిప్ట్‌ని తీసుకొస్తే తాను చేయడానికి సిద్ధమే అని చిరు అన్నారు. అంటే.. ఇక్కడ పూరీదే ఆలస్యం అన్నమాట. ఇంకేముంది.. చిరు చెప్పారు కాబట్టి, అతను వెంటనే ఆ పనుల్లో బిజీ అయ్యే అవకాశాలున్నాయి.
అయితే.. ఈ ప్రాజెక్ట్ ఒకవేళ ఫిక్స్ అయితే అది 153వ మూవీ అవుతుంది. ఎందుకంటే.. అంతకుముందే చిరు తన 151, 152 సినిమాలను సురేందర్ రెడ్డి, బోయపాటి శీనులతో కమిట్ అయ్యాడు. ఆ తర్వాతే చిరు ఖాళీ అవుతారు. అంతలోపు పూరీకి చాలా సమయం ఉంది కాబట్టి.. చిరు కోరుకున్న విధంగా ‘ఆటోజానీ’కి రిపేర్ చేయొచ్చు.