Newsఆ నటి చేసిన పొరపాటుకు భారీ ఫైన్.. ఏం చేసిందో తెలుసా?

ఆ నటి చేసిన పొరపాటుకు భారీ ఫైన్.. ఏం చేసిందో తెలుసా?

Popular television actress Deepika Singh, who played the female lead role of Sandhya Rathi in Diya Aur Baati Hum, has reportedly been slapped with a notice to pay Rs 16 lakh by producers.

కెరీర్ ప్రారంభంలో భామలందరూ చాలా ఒదిగిమణిగి ఉంటారు. దర్శకనిర్మాతలు చెప్పిన పనిని చేసుకుపోతారు. సమయానికి షూటింగ్ స్పాట్‌కి చేరిపోతారు. అయితే.. క్రేజ్ పెరిగేకొద్దీ వారిలో క్రమంగా మార్పులు వస్తుంటాయి. తమ డిమాండ్ పెరిగిందన్న విషయం గ్రహించి.. పొగరు చూపించడం ప్రారంభిస్తారు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వమంటూ నిర్మాతల్ని వేధించడం మొదలుపెడతారు. టైంకి షూటింగ్‌కి రారు. ఇంకా రకరకాలుగా తమ పైశాచికాన్ని ప్రదర్శిస్తారు. ఇలా చేసిన వారందరూ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. తాజాగా వీరి జాబితాలో మరో నటి చేరిపోయింది. ఆమె పేరే దీపికా సింగ్.

ప్రముఖ హిందీ సిరియల్ ‘దియా ఔట్ బాతి హమ్’లో ప్రధాన పాత్రలో దీపికా నటిస్తోంది. ఈ సీరియల్ తెలుగులోనూ ‘ఈతరం ఇల్లాలు’ అనే పేరుతో ప్రసారం అవుతోందిలెండి. ఈ సీరియల్ ద్వారా దీపికాకి మంచి ఆదాయంతోపాటు పేరుప్రఖ్యాతలు కూడా దక్కాయి. అయితే.. ఈమధ్య ఈ అమ్మడు ఈ సీరియల్ సెట్‌కు ఆలస్యంగా రావడం మొదలుపెట్టింది. ఏదో ఒకటి లేదా రెండు గంటలైతే ఏమో అనుకోవచ్చు.. ఏకంగా ఆరు గంటలు లేటుగా వచ్చేది. తొలుత దర్శకనిర్మాతలు టైంకి రమ్మని రిక్వెస్ట్ చేశారు. కానీ.. వినలేదు. మళ్ళీ రిక్వెస్ట్ చేసినా అదే బాపతు. దీంతో మండిపడ్డ ఈ సీరియల్ యాజమాన్యం.. ఆమెకు భారీ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అక్షరాల రూ.16 లక్షలు చెల్లించాలని ఆమెకి నోటీస్ పంపారు.

ఈ ఇష్యూకంటే ముందు మరో వివాదం చోటు చేసుకుంది. అదేంటంటే.. ఈ టీవీ సీరియల్ నిర్మాతలు ఆమెకి పారితోషికంగా రూ.1.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ.. తాము అంతమొత్తం ఇచ్చుకోలేమని, కేవలం రూ.67 లక్షలు చెల్లించగలమని నిర్మాతలు చెప్పారు. దీంతో ఖంగుతిన్న దీపికా.. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని కలిసి, పారితోషికం గొడవపై ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి దీపికాకి, ఆ టీవీ సీరియల్ యాజమాన్యానికి విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తదనంతరం దీపికా సెట్‌కి ఆలస్యంగా రావడం మొదలుపెట్టిందని, అందుకే భారీ జరిమానా విధించామని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు.. దీపికా, ఆమె అనుచరులు మరో విధంగా స్పందిస్తున్నారు. దీపికాతో నటించాల్సిన సహచర నటుడు అనాస్‌ ఉ. 10 గంటలకు సెట్‌కు రావాల్సి ఉండగా సా. 4 గంటలకు వచ్చేవారని.. ఆయన లేకుండా దీపికా మాత్రం ముందుగా వచ్చి ఏం చేయాలని ఆమె సహచరులు చెప్పినట్లు సమాచారం. దీపికకు నిర్మాతలు శశి, సుమీత్‌తో వివాదం జరిగిందని, సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ ఘటన గురించి మాట్లాడలేమని, వివరాలు సేకరించి సమస్యను పరిష్కరిస్తామని అని ఐఎఫ్‌టీపీసీ ఛైర్మన్‌ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news