ఎన్టీఆర్ – బాబీ సినిమా టైటిల్‌పై రచ్చ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దుమారం

nandamuri fans requests to change ntr bobby movie title

Nandamuri fans demanding to change the title of NTR’s 27th project. Recently a rumour went viral on this movie that unit decide to put a name Nata Vishwaroopam as title which disappoints the fan because of these reasons.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి ‘నట విశ్వరూపం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నట్లు ఈమధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందులో తారక్ మూడు పాత్రల్లో నటిస్తుండడం, స్ర్కిప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండడంతో.. ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించి, దాన్నే ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపించింది. ఈ టైటిల్ వార్త విని.. తారక్ నట విశ్వరూపానికి తగ్గట్టుగా టైటిల్ అదిరిపోయిందని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆ టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. టైటిల్‌లో గ్రాండ్‌నెస్ ఉన్నప్పటికీ.. ఉన్నట్లుండి ఫ్యాన్స్ టైటిల్‌పై రచ్చ చేయడానికి ఓ బలమైన కారణం ఉందిలెండి.

అదేంటంటే.. గతంలో ‘విశ్వరూపం’ పేరుతో సీనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది. దాసరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని భావిస్తే.. దారుణమైన పరాజయం పాలైంది. దీంతో.. గతంలో సీనియర్ ఎన్టీఆర్‌కి అచ్చిరాని ఆ టైటిల్ మనకెందుకని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదొక్కటే కాదండోయ్.. మరో కారణం కూడా ఉంది. ‘విశ్వరూపం’ టైటిల్‌పై కమల్ ఓ సినిమా చేయగా.. అది మంచి విజయం సాధించింది. దాంతో.. ‘విశ్వరూపం-2’ సినిమాని పట్టాలపైకి తీసుకెళ్ళాడు కమల్. అది కూడా దాదాపు రెడీ అయింది. ఇలాంటి సమయంలో ‘నట విశ్వరూపం’ అనే టైటిల్ పెడితే కమల్ సినిమాతో పోలికలు వస్తాయని.. ఆ టైటిల్ పెట్టొద్దని వేడుకుంటున్నారు. మరి.. ఫ్యాన్స్ కోరిక మేరకు తారక్ తన సినిమా టైటిల్ మారుస్తాడా? లేదా? చూడాలి.

కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ఇందులో తారక్ సరసన కాజల్ అగర్వాల్, నివేదా థామస్, అనుపమలు కథానాయికలుగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ఫై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు.

Leave a comment