ఆ మాట వింటేనే కస్సుబుస్సులాడుతున్న సన్నీ!

Sunny Leone Fires On her Title

బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్‌కు చమటలు పట్టిస్తున్నది ఎవరంటే.. ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సన్నీ లియోన్. బాలీవుడ్ జనాలతో పాటు యావత్ భారతదేశ ప్రజలు సన్నీ నామజపం చేస్తున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలిపోయింది. మోస్ట్ సెర్చెడ్ పర్సనాలిటీగా భారతదేశంలో టాప్ ప్లేస్ దక్కించుకుంది సన్నీ. అప్పట్లో కేవలం పోర్న్ సినిమాలు మాత్రమే చేసిన సన్నీ.. ఇండియాలో బాలీవుడ్ అవకాశాల వెల్లువ రావడంతోనే తనకు పాపులారిటీ పెరిగిందంటూ చెబుతోంది సన్నీ. అయితే సన్నీకి ఉన్న బిరుదును ఎవరైనా పలికితే మాత్రం ఆమె మోహం ఎర్రగా మారిపోతుందట. ఇంతకీ ఆమెను ఎవరు అలా పిలిచారో తెలుసా.. ఆమె ఫ్యాన్స్!

అవును.. ఇది నిజం. తాను గతంలో చేసిన పోర్న్ సినిమాల వల్ల తనను ఇంకా పోర్న్ స్టార్‌గా పిలుస్తున్నారు కొంత మంది ఆడియెన్స్. అయితే ఈ బిరుదు అమ్మడికి అస్సలు నచ్చట్లేదట. తనను ఎవరైనా అలా పిలిస్తే అమ్మడికి చిర్రెత్తుకొచ్చేస్తోందట. అంతే ఇక కోపంతో రగిలిపోయి సన్నీ వారిని చెడామడా తిట్టేస్తుందట. తనకు బాలీవుడ్‌ జనాల ద్వారా మంచి గుర్తింపు వచ్చినా తన గతాన్ని ఇంకా ఎందుకు గుర్తుకు చేస్తున్నారంటూ ఫీలవుతోంది సన్నీ. ఏదేమైనా ఒకప్పుడు తాను చేసిన పని ఇప్పుడు తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందని ఫీల్ అవుతోందట సన్నీ.. పాపం!