Newsఐశ్వర్యరాయ్ ఆత్మహత్య..? దారుణమైన పచ్చి నిజాలు!!

ఐశ్వర్యరాయ్ ఆత్మహత్య..? దారుణమైన పచ్చి నిజాలు!!

A blog that goes by the name of ‘Outlook Pakistan‘ ran a news article claiming that Aishwarya Rai Bachchan had attempted suicide.

‘రూమర్లు సృష్టించాలన్నా మేమే.. వాటిని తిరగరాయాలన్నా మేమే’ అన్నట్లు వ్యవహరిస్తోంది ప్రస్తుత మీడియా. ముందూవెనకా ఏమీ ఆలోచించుకోకుండా తనకు తోచింది చేసుకుంటూపోతోంది. ఏదో ఒక్క చిన్న విషయం తెలిస్తే చాలు.. దానిపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ టీఆర్‌పీ రేటింగ్ రాబట్టుకోవడం కోసం న్యూస్ ఛానెళ్లు పోటాపోటీగా గగ్గోలు పెడుతున్నాయి. తాము చేసే ఈ పనివల్ల ప్రజలతోపాటు తమకూ నష్టం వాటిల్లుతుందనే చిన్న విషయాన్ని గ్రహించకుండా దూసుకుపోతున్నాయి. వెబ్‌సైట్లది కూడా అదే బాపతు. తాము రాసిందే కరెక్ట్ అని భావిస్తూ కావ్‌కావ్‌మంటూ పుకార్లు సృష్టిస్తుంటారు. ఇలాగే ఓ రూమర్ క్రియేట్ చేసిన ఒక వెబ్‌సైట్.. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది.

తమకు ఎక్కువ వ్యూస్ వస్తాయనో లేక మరేదైనా అనుకుందో కానీ.. ఓ పాకిస్తాన్ వెబ్‌సైట్ మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండానే ఐశ్వర్యరాయ్ చనిపోయిందంటూ రూమర్ క్రియేట్ చేసింది. గతకొంతకాలం నుంచి ఆమెకి, అభిషేక్ బచ్చన్‌కి విభేదాలు ఏర్పడ్డాయని.. సినిమాల్లో నటించవద్దని ఎంత వారించినా, ఐశ్వర్యరాయ్ ఆ మాటని పెడచెవిన పెట్టిందని.. అంతేకాకుండా ఆమె ‘ఏయ్ దిల్ హై ముష్కిల్’ మూవీలో రెచ్చిపోయిమరీ ఘాటుగా నటించిందని.. అది చూసి తీవ్ర మనోవేదనకు గురైన అభిషేక్ ఆమెపై చెయ్యి కూడా చేసుకున్నాడని.. దాంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని ఆ వెబ్‌సైట్ ఓ వార్తని పబ్లిష్ చేసింది. అప్పుడు వెంటనే బచ్చన్ ఫ్యామిలీ ఇంటికే డాక్టర్ల బృందాన్ని పిలిపించి, ఆమెకి వైద్యం చేయించారని.. దాంతో ఆమె కోలుకుందని ఆ వార్తలో తెలిపింది. ఈ సూసైడ్ విషయం బయటపడకూడదనే ఉద్దేశంతోనే ఇంటికి డాక్టర్లను పిలిపించుకున్నారని, కానీ చివరికి ఈ న్యూస్ బయటపడిందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. అంతేకాదు.. ఐశ్వర్య తన చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఓ ఫోటోని సైతం ప్రచురించింది.

ఈ వార్త చూసి ఖంగుతిన్న బాలీవుడ్ జనాలు.. వెంటనే బచ్చన్ ఫ్యామిలీకి ఫోన్ చేయడం మొదలెట్టారు. దాంతో.. ఆ కుటుంబసభ్యులు కూడా కోలుకోలేని షాక్‌కి గురయ్యారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఇవన్నీ రూమర్లేనని చెప్పడంతో అందరితో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఆ వెబ్‌సైట్ మీద అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. మన ఇండియన్ మీడియా కూడా సదరు వెబ్‌సైట్‌పై మీద జోకులు వేసుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news