చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్ ముగిసిన తరువాత స్పోర్ట్స్ కోటాలో ఓ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తమ జీవితాన్ని గడిపేస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమకు ఆటపట్ల ఉన్న మక్కువను ఏదో ఒక సమయంలో చూపిస్తుంటారు. అచ్చం ఇలాంటిదే జరిగింది ఇండియన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నీ మైలురాయిలను అధిగమించిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం తన జీవితాన్ని చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రం తనకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తరచూ చూపిస్తూనే ఉన్నాడు.
తాజాగా ఇటీవల గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించాడు సౌరవ్ గంగూలీ. గల్లీ పిల్లలతో కలిసి సౌరవ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. ఇక పిల్లలతో ఆడిన సౌరవ్ తనలో ఇంకా క్రికెట్ టెక్నిక్స్ మారలేదని తన షాట్స్ తో నిరూపించుకున్నాడు. అయితే ఇదే సమయంలో ఓ బౌలర్ వేసిన బంతి సౌరవ్ భుజానికి గట్టిగా తగిలింది. కాగా అది టెన్నిస్ బంతి కావడంతో పెద్దగా గాయమేమి కాకపోవడంతో మళ్లీ పిల్లలతో క్రికెట్ ఆడటం మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం గల్లీ క్రికెట్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.