Finally, the ace producer Sai Korrapati has given clarity on Gautamiputra Satakarni ceded and vizag theatrical rights rumours.
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడానికి కొన్నిరోజుల ముందు కొందరు ఆకతాయిలు వాటికి వ్యతిరేకంగా రూమర్లు సృష్టిస్తుంటారు. రిలీజ్‌కి ఏవో అడ్డంకులు ఎదురయ్యాయని, యూనిట్లో గొడవలు చోటు చేసుకున్నాయని, ఇంకా రకరకాల ప్రచారాలు క్రియేట్ చేస్తారు. ఇవి అటుఇటు చక్కర్లు కొడుతూ చివరికి ఫ్యాన్స్ వరకు చేరగా.. వాళ్లు అవి విని బెంబేలెత్తిపోతారు. తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలోనూ అలాగే జరిగింది.
ఈ మూవీకి సంబంధించి రెండు ఏరియాల రైట్స్ తీసుకున్న ఓ ప్రముఖ నిర్మాత హ్యాండిచ్చేశాడని, దాంతో నిర్మాతలు లాస్ ఎదుర్కొన్నారని, రిలీజ్‌కి కొత్త కష్టాలొచ్చాయని ఓ పుకారు షికారు చేసింది. దీంతో.. ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. తమ అభిమాన నటుడి ప్రతిష్టాత్మక మూవీకి అప్పుడే కష్టాలు రావడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. ఇప్పుడు ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలియడంతో.. వాళ్లంతా సంతోషంగా ఉన్నారని తెలిసిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి ‘శాతకర్ణి’ మూవీ సీడెడ్, వైజాగ్ రైట్స్‌ని భారీ రేటుకి కొనుగోలు చేశారు. సినిమా రిలీజ్ అయ్యేలోపు మొత్తం డబ్బులు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నారు. అయితే.. డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ కారణంగా డబ్బులు సర్దుబాటు చేయలేకపోయారని, అందుకే ఈ డీల్ నుంచి తప్పుకున్నారని టాక్ వినిపించింది. కానీ.. ఈ వార్తల్లో వాస్తవం లేదని స్వయంగా కొర్రపాటి వెల్లడించాడు.
తనపై వచ్చిన రూమర్లన్నీ అవాస్తవాలనీ, తానే ఆ రెండు ఏరియాల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ రూమర్స్ ఎవరు సృష్టిస్తారో, అసలెందుకు క్రియేట్ చేశారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ విధంగా సాయి ఆ రూమర్లపై స్పష్టత ఇవ్వడంతో.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.