ఎన్టీఆర్ కోసం వెంటనే ఒప్పేసుకున్న ‘శివగామి’

ramya krishna to play key role in ntr bobby film

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదు. అందుకే.. బాబీ దర్శకత్వంలో అతను చేయనున్న సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లకుండానే భారీ క్రేజ్ సంపాదించుకుంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమాలో నటించడం కోసం సీనియర్ నటీనటులు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఒకప్పటి హీరోయిన్ రమ్యక్రిష్ణ అయితే.. ఇందులో నటించే ఛాన్స్ రాగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.

‘బాహుబలి’ సినిమాలో శివగామిగా తన సత్తా చాటుకున్న రమ్యకృష్ణకి ఈమధ్య ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తారక్ సినిమాలో ఓ కీలకపాత్ర ఉండగా.. దానికి రమ్యకృష్ణ సరైన న్యాయం చేస్తుందని యూనిట్ ఆమెని సంప్రదించిందట. ఎన్టీఆర్ సినిమా అనగానే ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అలాగే.. స్ర్కిప్ట్‌తోపాటు తన పాత్ర కూడా నచ్చడంతో.. ఈ సినిమా ఖచ్చితంగా చేస్తానని రమ్య అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా రానుంది. గతంలో ‘సింహాద్రి’, ‘నా అల్లుడు’ సినిమాల్లో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన రమ్య.. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్ళీ అతని మూవీలో కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం.

Leave a comment