Whenever a person entered in temple, he directly went to that place where bells situated and rang. Do you know why everyone do like this. According to mythological there is strong reason. Read below article to know full details.
దేవాలయంలో వెళ్లిన తర్వాత భక్తులు గుళ్లో ఉన్న గంటలు మోగిస్తారు. అయితే.. ఎందుకు మోగిస్తారన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఏదో గుడిలో గంట ఉంది కదా.. అందరూ కొడుతుంటారు మనం కూడా ఓ చెయ్యేసి వెళదామని ధ్యాసతో మోగించి వెళ్లిపోతారే తప్ప.. దాని వెనుకున్న పరమార్థం మాత్రం అస్సలు తెలిసి ఉండదు. కొందరు మాత్రం ఇలా గంటలు మోగించడం వల్ల.. ఆ శబ్దంతో దేవుడు పరధ్యానం మాని, తమపై చూసి సారించి ప్రార్థనలు వింటాడని అనుకుంటారు. కానీ.. అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే.. భగవంతుడు ఎప్పుడూ మనకోసం ఎదురుచూస్తూ ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి.. గంటెందుకు కొటతారని అనుకుంటున్నారా..? అయితే మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.
గంట మోగించడం వల్ల వెలువడే శబ్దం మంగళకరమైన ధ్వనిగా పేర్కొంటారు. ఇది.. విశ్వానికి భగవన్నామమయిన ‘ఓంకార’ నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని దర్శనం పొందడానికి బాహ్య అంతరాలతో పవిత్రత ఉండాలి. అందుకే.. గంట మ్రోగిస్తాం. దీంతో మరో పరమార్థం కూడా ఉంది. అదేమిటంటే.. భగవంతుడికి వివిధ సేవలు జరుగున్నాయి అని తెలియచేయడానికి ఆలయంలో గంట మ్రోగిస్తారు. దానిని ఆలయ ఉద్యోగులు, అర్చకులు వినియోగిస్తారు. సుప్రభాతం, అభిషేకం, నివేదనం ఇలాంటి సేవాసమయాలను భక్తులకు సూచించటానికి ఈ గంట. అలాగని ఎలాపడితే అలా బాదేయకూడదు.. మనం గంట గట్టిగ కొడితే ధ్యానం చేసే వారికీ భంగం కలిగించినవారు అవుతారు.