మరో చారిత్రాత్మక రికార్డ్ సృష్టించిన ‘శాతకర్ణి’ ట్రైలర్.. యూట్యూబ్‌లో దబిడిదిబిడే!

gautamiputra satakarni crosses 2 millions views in just 21 hours

Balayya’s prestigeous project Gautamiputra Satakarni trailer has created another historical record. According to latest updates, it crossed 2.2 million views in just 21 hours time span and also got more than 50 thousand likes.

శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు బాలయ్య ప్రతిష్టాత్మక వందో ప్రాజెక్ట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి సంబంధించి ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో దాని సందడే కొనసాగుతోంది. కళ్లుచెదిరే విజువల్స్, బాలయ్య రౌద్రరూపం, హాలీవుడ్‌ని తలపించే యుద్ధ సన్నివేశాలు, ఇంకా మరెన్నో వండర్స్‌తో నిండిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో.. నెటిజన్లు దీనిని ఎగబడి చూస్తున్నారు. దాంతో.. ఇది రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

ఇప్పటికే.. ఈ ట్రైలర్ విడుదలైన 4:30 గంటల వ్యవధిలోనే 1.1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మరో చారిత్రాత్మక ఘనతని ఈ ట్రైలర్ సాధించింది. 21 గంటల్లోనే 2.2 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంతేకాదు.. 50 వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఇంత తక్కువ సమయంలో ఓ తెలుగు ట్రైలర్‌కి అన్ని వ్యూస్, లైక్స్ రావడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి.. ఆ ట్రైలర్ నెటిజన్లను ఎలా మంత్రముగ్ధుల్ని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ వయసులోనూ బాలయ్య చేసిన వీరోచిత పోరాటాలు, 8 నెలల వ్యవధిలోనే అదిరిపోయే క్వాలిటీతో చారిత్రాత్మక విజువల్స్ చూపించిన క్రిష్ ప్రతిభ వల్లే ఈ ట్రైలర్ యూట్యూబ్‌నే షేక్ చేసేస్తోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ట్రైలర్ కారణంగా.. ఇప్పటివరకున్న పదింతల క్రేజ్ ఈ చిత్రానికి వచ్చేసింది.

Leave a comment