When the black money holders caught redhanded with new currency note, there is rumour going virally on nationalwide. Everyone thinking that, a chip is enabled in new note. But, in the fact there is no chip. Then how IT and ED departments raiding who have new notes. Read below story to know more details.
నల్లకుబేరుల భరతం పట్టాలని మోదీ ప్రభుత్వం పాత 500-1000 నోట్లను రద్దు చేసి, కొత్త 500-2000 నోట్లను ప్రవేశపెట్టినా.. వాళ్లు ఎలాగోలా అక్రమ మార్గాల ద్వారా కోట్లకు కోట్లు నోట్లను మార్చుకుంటున్నారు. సాధారణ ప్రజలు డబ్బులు దొరక్క విలవిలలాడుతుంటే.. వాళ్లు మాత్రం దర్జాగా ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటున్నారు. అయితే.. ఇలా కొత్త నోట్లను దాచినవారు మాత్రం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతున్నారు. ఆదాయపన్ను శాఖ, అవినీతి నిరోధక శాఖ, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అంతా కలిసి దాడులు చేస్తుండడంతో.. కొత్త నోట్లు దాచుకున్న బ్లాక్‌మనీగాళ్ల గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కొన్ని వారాల వ్యవధిలోనే ఎంతోమంది పట్టుబడ్డారు.
ఇలా.. ప్రతిఒక్కరూ దొరికిపోతున్న నేపథ్యంలో తాజాగా కొత్త 2 వేల నోటుపై ఓ ప్రచారం ఊపందుకుంది. గతంలో ఒక రూమర్ చక్కర్టు కొట్టినట్లుగా ఇందులో జీపీఎష్ ఎనేబుల్ చేసిన ఓ ఎలక్ట్రానిక్ చిప్ ఉందని, ఫాస్పరస్ 32 ఐసోటోప్ ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే.. కొత్త నోట్లు ఎక్కడ దాచినా అధికారులు ట్రేస్ చేయగలుగుతున్నారని, నల్లకుబేరుల భరతం పడుతున్నారని అంటున్నారు. అలాంటి చిప్ ఏమీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. జనాలు మాత్రం అది ఉన్నట్లు నమ్ముతున్నారు. దీంతో.. రంగంలోకి కొందరు విశ్లేషకులు దిగి, ఆ చిప్ లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. కొత్త నోట్లను దాస్తున్నవారు ఎలా దొరికిపోతున్నారన్న విషయాన్ని కూడా వెల్లడించారు. ఎక్కడైతే కొత్త నోట్లను ముద్రించారో.. అక్కడినుంచి మొదలు ఆ డబ్బు మొత్తం ఎక్కడికి పోతుందో జాగ్రత్తగా పలిశీలిస్తే పట్టుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కొత్త నోట్లను పట్టుకోవడానికి చిప్‌లు, ఐసోటోప్‌లు అవసరం లేదని, సాధారణ విధానాల్లోనే తెలిసిపోతుందని చెబుతున్నారు.
బ్యాంకులన్నీ తమతమ శాఖల్లో ఎంత డిపాజిట్ అయింది, ఎంత విత్ డ్రా అయింది, ఏయే అకౌంట్ల మధ్య క్యాష్ ట్రాన్సఫర్ జరిగిందనే బ్యాంకింగ్ కార్యకలాపాల వివరాల్ని ప్రతిరోజూ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకుల సర్వర్లు ఆర్బీఐతో లింక్ అయి ఉంటాయి కాబట్టి.. ఆ వివరాలన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి. అంతేకాదు.. కేంద్రం ఆర్థిక శాఖ పరిధిలో నేరుగా పనిచేసే ఎకనమిక్ ఇంటిలిజెన్స్ కౌన్సిల్‌లో భాగంగా పనిచేసే ఫైనాన్షియల్ ఇంటిలిజెన్సు యూనిట్‌కు కూడా ఈ వివరాలన్నీ యాక్సెస్ ఉంటుంది. ఈ మొత్తం లావాదేవీలను అవి అత్యంత నిశితంగా పరిశీలిస్తాయి. ఎక్కడ ఏ అనుమానం వచ్చినా.. వెంటనే ఐటీ, ఈడీ శాఖలకు సమాచారం ఇస్తాయి.
ఇక ఆర్బీఐ వద్ద కూడా కచ్చితమైన వివరాలుంటాయి. ఏ బ్యాంకుకు, ఏ బ్రాంచికి ఎంత క్యాష్ ఇచ్చాం.. ఏటీఎంలకు సరఫరా అవుతున్న తీరు.. రోజులో బ్రాంచిల్లో జరిగే విత్ డ్రాలు.. ఏటీఎంల్లో తీసే నగదు వంటి వివరాలన్నీ అప్‌డేట్ అవుతాయి. అలాగే.. కొత్త నోట్లు ముద్రణ కేంద్రాల నుంచి బయటకు పంపించేటప్పుడే ప్రతి నోటు నంబరును నమోదు చేసి.. ఏఏ నంబర్లు ఎక్కడకు పంపిస్తున్నామన్న వివరాలను కూడా ఆర్బీఐ రికార్డ్ చేసుకుంటుంది. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటిస్తుండడం వల్లే కొత్త నోట్లను ఎక్కడ దాచినా దొరికిపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం కొత్త నోట్లను బ్యాంకులు, ఏటీఎంల నుంచి మాత్రమే పొందే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగుల పాత్ర లేనిదే కొత్త నోట్ల దారి మళ్ళే ఛాన్సే లేదు. దీంతో ఫైనాన్షియల్ ఇంటిలిజెన్సు యూనిట్.. ఏఏ శాఖల పరిధిలో తక్కువ సమయంలో భారీ మొత్తాలు లావాదేవీలు జరుగుతున్నాయో గుర్తించి నిఘా పెడుతున్నారు. బ్రాంచిలో సిబ్బంది సంఖ్య, కొత్త పరిమితుల నేపథ్యంలో రోజుకు ఎంత ట్రాన్జాక్ట్ చేసే సామర్థ్యం ఉంటుందన్న కచ్చితమైన అంచనాతో అక్కడ తేడా జరిగిందో లేదో పసిగడుతున్నాయి. ఆ సమాచారంతో ఐటీ – ఈడీ రంగంలోకి దిగుతున్నాయి. పరిశోధన జరిపి పట్టుకుంటున్నాయి.
ఫైనాన్షియల్ ఇంటిలిజెన్సు యూనిట్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఏఏ శాఖల పరిధిలో తక్కువ వ్యవధిలో భారీ మొత్తాలు ట్రాన్‌జాక్షన్ అవుతున్నాయో గుర్తించి నిఘా పెడుతున్నారు. ఆ బ్రాంచిలో సిబ్బంది సంఖ్య… కొత్త పరిమితుల నేపథ్యంలో రోజుకు ఎంత ట్రాన్జాక్ట్ చేసే సామర్థ్యం ఉంటుందన్న కచ్చితమైన అంచనాతో అక్కడ తేడా జరిగిందో లేదో పసిగడుతున్నాయి. ఆ సమాచారంతో ఐటీ – ఈడీ రంగంలోకి దిగుతున్నాయి. పరిశోధన జరిపి పట్టుకుంటున్నాయి. అదీ సంగతి. సో… జీపీఎస్ – చిప్ ఏదీ అవసరం లేకుండా నల్లధనవంతులకు బ్యాండ్ పడుతోంది.. అంతేకాదు.. కొద్దివారాలుగా అడ్డగోలుగా కమీషన్లతో కోట్లు సంపాదించేస్తున్న బ్యాంకు ఉద్యోగులకూ నెత్తి బొప్పి కట్టడం ఖాయం.