Moviesఆ సినిమా సాక్షిగా.. రాజ్ తరుణ్‌తో హెబ్బా పటేల్ పెళ్ళి!

ఆ సినిమా సాక్షిగా.. రాజ్ తరుణ్‌తో హెబ్బా పటేల్ పెళ్ళి!

According to the latest updates, young Raj Tarun is playing cameo role in Hebbah Patel’s Nanna Nenu Naa Boyfriends movie. In the end he will marry hebbah and this is biggest twist in the whole movie.

యంగ్ హిట్ పెయిర్‌గా పేరుగాంచిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్‌ల మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్ళి కూడా చేసుకుంటారని పుకార్లు షికారు చేశాయి. ఆమధ్య ఓ ఆడియో ఈవెంట్‌లో తాను రాజ్‌తో డేటింగ్‌కి వెళతానని బహిరంగంగా చెప్పడంతో.. ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఆ ప్రచారాల సంగతేమోగానీ.. ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళి చేసేసుకున్నారు. అవును.. మీరు చదువుతోంది నిజమే. ఆన్‌స్ర్కీన్ మీద చూడముచ్చట జంటగా అనిపించే వీరిద్దరూ.. దేవుడి సాక్షిగా ఒక్కటయ్యారు. అయితే.. ఇదంతా నిజం కాదులెండి.. ఉత్తుత్తే!

హెబ్బా పటేల్ కథానాయికగా దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ మూవీలో అశ్విన్, పార్వతీశం, నోయల్‌లు ప్రేమలో పడేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేయగా.. చివర్లో ఓ అబ్బాయి వచ్చి ఆమె మెడలో తాళి కట్టేస్తాడట. అతడే రాజ్ తరుణ్ అని తెలుస్తోంది. ఈ మూవీలో ఇదే అసలైన ట్విస్ట్ అని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు సీన్‌లోకి రాజ్ తరుణ్ ఎందుకు ఎంట్రీ ఇస్తాడు? ఆ ముగ్గురిని కాదని హెబ్బా అతడ్ని ఎందుకు పెళ్ళి చేసుకుంటుంది? అసలు సినిమా కథేంటి? అనేది తెలియాలంటే.. వెండితెరపై మూవీ చూడాల్సిందేనని చిత్రబృందం చెబుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news