నయనతార లవర్‌తో రమ్యకృష్ణ సినిమా.. సూర్యతో ఏమాత్రం సంబంధం లేదన్న శివగామి

ramya krishna reveals shocking news of surya new film under vignesh direction

Senior actress Ramya Krishna reveals a shocking secret of hero Suriya Sivakumar’s latest film. Nayanatara boyfriend Vignesh Shivan directing this film and Keerthi Suresh playing female lead role.

‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలో నటించిన తర్వాత రమ్యకృష్ణ కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది. ఆమెకి వరుసగా భారీ ఆఫర్లు వరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకి హీరో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాలో కీలకపాత్రలో నటించే ఛాన్స్ దక్కింది. నయనతార లవర్ అయిన విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి.. రమ్యకృష్ణ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను ఈ చిత్రంలో కీ-రోల్‌లో నటిస్తున్నప్పటికీ.. హీరో సూర్యతో కలిసి ఒక్క సీన్‌లోనూ కనిపించనని చెప్పింది.

అవును.. మీరు చదువుతోంది నిజమే. స్వయంగా రమ్యనే రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించింది. రమ్యకృష్ణ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో కీలకమైందని.. కానీ సూర్యతో కలిసి ఒక్క సీన్‌లోనూ తాను వెండితెర మీద కనిపించనని పేర్కొంది. అసలు సినిమా మొత్తంలో తన పాత్రతో సూర్యకి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చింది. దీంతో.. సినిమా మొత్తంలో ఎంతో కీలకమైన పాత్రని హీరోతో సంబంధం లేకుండా దర్శకుడు విఘ్నేష్ ఎలా డిజైన్ చేశాడా? అని అందరూ ఆలోచనలో పడిపోయారు. దానికి సమాధానం కావాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందేనని రమ్యకృష్ణ చెబుతోంది.

Leave a comment