Ram Charan’s latest movie Dhruva has got positive response all over. In this movie Ram Charan has done fabulously in his career in which we can see only a powerful and intelligent IPS officer. Director Surender Reddy who is named as stylish director has handled very well this project.
రీమేక్ సినిమాలంటే.. చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఒరిజినాలిటీని మిస్ అవ్వకుండా తీయాలి కాబట్టి.. ప్రతిచోటా జాగ్రత్త వహించాలి. కాస్త అటుఇటు అయినా.. సినిమా గోవిందే. అందుకే.. చాలామంది దర్శకులు రీమేక్ సినిమాలంటే వెనకడుగు వేస్తారు. కాస్త తేడా కొట్టినా.. తమ కెరీర్ కంచికే చేరుతుందనే ఉద్దేశంతో, ఆ మూవీలకు దూరంగానే ఉంటారు. కానీ.. కొందరు మాత్రం ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. రిస్క్ అని తెలిసినప్పటికీ.. తమ సత్తా ఏంటో చూపించుకోవడం కోసం ఇదే మంచి అవకాశమని భావించి ముందుకొస్తారు. అయితే.. ఇలా ముందుకొచ్చి వారిలో కేవలం కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటివారిలో తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చేరిపోయాడు.
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తనిఒరువన్’ చిత్రాన్ని ఈ స్టైలిష్ దర్శకుడు చాలా అద్భుతంగా రీమేక్ చేశాడు. తెలుగు ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేలా స్టోరీలో మార్పులు చేసి, ఒరిజినాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా కేర్ తీసుకున్నాడు. సీన్ టు సీన్ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా.. చకచకా సాగిపోయేలా, సినిమాలో బాగా ఇమిడిపోయేలా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు. ఈ ప్రతిభ చూపినందుకు అందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సాధారణ కమర్షియల్ చిత్రాలను రీమేక్ చేయడానికి డైరెక్టర్లు జంకుతున్న ఈ రోజుల్లో.. మైండ్‌గేమ్‌తో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా రీమేక్ చేసి, ఔరా అనిపించాడు. తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. దర్శకుడిగా ఫుల్ మార్క్స్ సంపాదించుకున్నాడు.
ఇక రామ్ చరణ్ విషయానికొద్దాం.. కెరీర్ ప్రారంభం నుంచి ‘ధృవ’కి ముందు వరకు ఇతని గ్రాఫ్ చూస్తే, ‘మగధీర’, ‘ఆరెంజ్’ సినిమాలు మినహా మిగతావన్నీ పాత చింతకాయపచ్చడే. అంటే.. రొటీన్ మాస్ మసాలా చిత్రాలే చేశాడు. దాంతో.. ఇతనికి మాస్ హీరో అనే ముద్ర పడిపోయింది. ప్రయోగాత్మక చిత్రాలకు ఈ హీరో ఏమాత్రం సూట్ అవ్వడనే భావన ఆడియెన్స్‌లో ఉండిపోయింది. కానీ.. ఎప్పుడైతే ‘తని ఒరువన్’ చేస్తున్నాడని తెలిసిందో, అప్పుడు జనాలు విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. అసలు ఎక్స్‌ప్రెషన్స్ పెట్టడం రాని ఈ మాస్ హీరో.. ఆ చిత్రంలో ఎలా నటిస్తాడు? జయం రవి పాత్రకు న్యాయం చేస్తాడా? అనే ప్రశ్నలతో కుళ్ళబొడిచారు. అనవసరంగా ఓ మంచి సినిమాని నాశనం చేస్తున్నాడనే కామెంట్స్ కూడా వినిపించాయి.
వాటన్నింటికీ రామ్ చరణ్ చెంపఛెళ్లమనేలా సమాధానం ఇచ్చాడు. తన ఫిజిక్‌ని బిల్డప్ చేసుకోవడం ఒక ఎత్తయితే.. నటనలో ఓ మెట్టు ఎదిగాడు. గత సినిమాలతో పోల్చుకుంటే.. మనం వెండితెరపై చూసింది రామ్ చరణ్‌నేనా? అనేలా సూపర్బ్‌గా నటించాడు. తన స్టార్‌డమ్‌ని పక్కనపెట్టేసి, స్ర్కిప్ట్‌కి ప్రాధాన్యతనిస్తూ శెభాష్ అనిపించుకున్నాడు. ఓ లక్ష్యం ఏర్పరచుకున్న పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి? అతని ఆలోచన విధానం ఏంటి? ఎలా ప్రవర్తించాలి? అన్న అంశాలకు పూర్తి న్యాయం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వెండితెరపై ఐపీఏస్ ఆఫీసర్ అయిన ‘ధృవ’ కనిపించాడే గానీ.. స్టార్ స్టేటస్ ఉన్న రామ్ చరణ్ కాదు. అంతలా తననితాను మార్చుకున్న చరణ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.