Movies‘ధృవ’ యూఎస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. మ్యాజిక్ మార్క్‌కి చేరువలో చెర్రీ

‘ధృవ’ యూఎస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. మ్యాజిక్ మార్క్‌కి చేరువలో చెర్రీ

Ram Charan’s latest movie Dhruva storming at USA boxoffice. This movie has earned $957 in it’s first weekend run with Premiers also. According to reports, it has been cleared that this is the first film which is entering in 1M mark in USA.

చాలాకాలం నుంచి రామ్ చరణ్ అతని ఫ్యాన్స్ కంటున్న ఆ కల త్వరలోనే నెరవేరబోతోంది. 1 మిలియన్ డ్రీమ్ మార్క్‌ని క్రాస్ చేయబోతున్నాడు. ప్రీమియర్స్ కలెక్షన్లు ఆ మార్క్‌ని చరణ్ ఈసారైనా అందుకుంటాడా? లేదా? అనే అనుమానాన్ని రేకెత్తించినా.. హిట్ టాక్, తొలిరోజు వచ్చిన వసూళ్లు దాన్ని సునాయాసంగా దాటేస్తాడన్న భోరాసానిచ్చాయి. విశేషం ఏమిటంటే.. ఫస్ట్ వీకెండ్ రన్‌లో ఈ చిత్రం 1 మిలియన్ మార్క్‌కి అతి చేరువకి చేరుకుంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రీమియర్స్ ద్వారా $223,314 కలెక్ట్ చేసిన ‘ధృవ’, తొలిరోజైన శుక్రవారం $245,233 వసూలు చేసింది. ఇక శనివారం అయితే.. ఈ మూవీ వసూళ్లు ఊహించని రేంజులో పెరిగాయి. ఏకంగా $342,652 కలెక్ట్ చేసింది. అక్కడి ఆడియెన్స్‌ని ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకోవడం వల్లే దీనికి వాళ్ళు బ్రహ్మరథం పట్టారని, అందుకే కలెక్షన్లు అలా పెరిగాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో.. ఆదివారంతోనే ఈ సినిమా 1 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేస్తుందని భావించారు కానీ.. ఆ రేంజులో వసూళ్లు రాలేదు. ఆరోజు ఈ చిత్రం $146,138 మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో.. ప్రీమియర్స్‌పాటు మొత్తం మూడురోజుల్లో కలుపుకుని ఈ చిత్రం యూఎస్ఏలో $957,337 రాబట్టింది. సోమవారంతో ఈ మూవీ 1 మిలియన్ క్రాస్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది.

శనివారంతో పోల్చుకుంటే.. కలెక్షన్స్ చాలా డ్రాప్ అయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇంతగా డ్రాప్ అవ్వడానికి కారణం ఏంటో తెలీదు కానీ.. చరణ్ మాత్రం 1 మిలియన్‌కి చేరువకి చేరడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

రోజులవారీగా యూఎస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ :
ప్రీమియర్స్ : $223,314
శుక్రవారం : $245,233
శనివారం : $342,652
ఆదివారం : $146,138
టోటల్ ఫస్ట్ వీకెండ్ : $957,337 (గ్రాస్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news