Movies టీజర్ టాక్ : ఈ ‘గుంటూరోడు’ అమ్మమొగుడిలా ఉన్నాడు!

టీజర్ టాక్ : ఈ ‘గుంటూరోడు’ అమ్మమొగుడిలా ఉన్నాడు!

Rocking star Manchu Manoj latest starrer Gunturodu movie teaser has released and it is very powerful with powerpacked action scenes. This movie directed by SK Satya and Pragya Jaiswal playing lead role opposite to Manoj. Rajendra Prasad and Kota Srinivas rao playing key roles in this film.

రాకింగ్‌స్టార్ మంచుమనోజ్ ప్రస్తుతం చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో ‘గుంటూరోడు’ ఒకటి. ఎస్.కే.సత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘కంచె’ ఫేం ప్రగ్యాజైస్వాల్ కథానాయికగా, రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది. పదండి.. ఈ టీజర్ ఎలాగుందో చూద్దాం…

అదిరిపోయే యాక్షన్ క్లిప్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్‌లో మొదటినుంచి చివరివరకు మాస్ దమ్ము ఎలివేట్ అయ్యేలా సూపర్బ్‌గా ఎడిట్ చేశారు. ఇందులో మంచుమనోజ్ మునుపెన్నడూలేని విధంగా ఊరమాస్ అవతారంలో కనిపించి, ఔరా అనిపించాడు. ఈ టీజర్ మధ్యలో ‘కొడితే ఒంట్లో ఉన్న 206 ఎముకలు ఒకేసారి ఇరిగిపోతాయ్ నా కొడకా’ అంటూ అతను చెప్పిన డైలాగ్ బ్రహ్మాండంగా పేలింది. హీరోయిజం, అతనిలో మాస్‌ని ఎలివేట్ చేస్తూ కోట శ్రీనివాసరావు చెప్పిన ‘ఆ కొట్టుడేంది.. ఆడి పవరేంది.. గుంటూరు ఘాటు మిరపకాయ్ ఒరిజినల్ బ్రీడ్ అమ్మా మొగుడిలా ఉన్నాడు’ డైలాగ్ కూడా చాలా బాగుంది. ఈ టీజర్‌ని అదిరిపోయే ఫైట్స్, యాక్షన్ సీన్లతో నింపడాన్ని చూస్తుంటే.. మూవీలో ఆ సన్నివేశాలకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని ఓ ఫ్రేములో ప్రగ్యా చాలా క్యూట్‌గా, అందంగా కనిపించింది.

ఇక టెక్నికల్ పరంగా మాట్లాడుకుంటే.. దర్శకుడు సత్య మేకింగ్ అదిరింది. మాస్‌ని, హీరోయిజంని ఎలివేట్ చేస్తూ అతను మనోజ్‌ని చూపించిన తీరు ఆకట్టుకుంది. ఇక డైలాగ్స్ కూడా బాగానే పేలాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒంట్లో ఎనర్జీని నింపేలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది కానీ.. బాగా కాన్సంట్రేట్ చేస్తే ‘సరైనోడు’ని తలపిస్తుంది. ఈ టీజర్‌ని ఎడిట్ చేసిన విధానం కూడా ఆ మూవీని గుర్తు చేస్తుంది. టైటిల్ కూడా దానికి దగ్గరగానే పెట్టారులే. ఏదేమైనా.. ఈ గుంటూరోడు మాత్రం తన మాస్ పవర్‌తో బాగానే ఆకట్టుకున్నాడని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news