Movies‘ధృవ’ సినిమా 17 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

‘ధృవ’ సినిమా 17 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

Mega powerstar Ram Charan’s latest movie Dhruva 17 days collections report is out. According to trade reports this movie doing well at the worldwide boxoffice even in third week in demonitisation days.

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘ధృవ’కి పోటీగా ఏ ఇతర సినిమాలు రిలీజ్ కాకపోవడంతో.. అది మూడో వారంలోనూ డీసెంట్ కలెక్షన్లతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో డీమోనిటైజేషన్ ఎఫెక్ట్‌ని ధీటుగా ఎదుర్కొంటూనే.. చరణ్‌కి మార్కెట్ లేని యూఎస్‌లోనూ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం మొత్తం 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 52.98 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో.. తెలుగు రాష్ట్రాల నుంచే రూ.37.96 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఎంత హిట్ టాక్ వచ్చినా.. మూడోవారంలోనే ఇతర సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోతాయి. అంతంత మాత్రం వసూళ్లతోనే ముందుకు సాగుతాయి. కానీ.. డీమోటినిటైజేషన్ రోజుల్లోనూ ఈ మూవీ డీసెంట్ వసూళ్లతో థర్ట్ వీక్‌లోనూ సంతృప్తికరమైన కలెక్షన్లతో రన్ అవుతోంది. అన్నిచోట్ల నుంచి ఈ మూవీకి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం వల్లే ఈ చిత్రం కరెన్సీ కష్టాల్లోనూ మంచి వసూళ్లు రాబడుతూ డిస్ట్రిబ్యూటర్లను సంతోషపరుస్తోందని అంటున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ‘తని ఒరువన్’ రీమేక్‌లో చెర్రీ ఓ పవర్‌ఫుల్ ఐఫీఎస్ ఆఫీసర్‌గా నటించగా.. అరవింద్ స్వామి ఒరిజినల్ వెర్షన్‌లో పోషించిన విలన్ పాత్రలోనే కనిపించాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో చాలా హాట్‌గా కనిపించడమే కాకుండా నటనాపరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లుఅరవింద్ నిర్మించిన ఈ మూవీ 17 రోజుల కలెక్షన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…

నైజాం : 14.07
సీడెడ్ : 6.23
వైజాగ్ : 4.98
గుంటూరు : 3.22
ఈస్ట్ గోదావరి : 2.92
కృష్ణా : 2.74
వెస్ట్ గోదావరి : 2.56
నెల్లూరు : 1.24
ఏపీ+తెలంగాణ : రూ. 37.96 కోట్లు (షేర్)
ఓవర్సీస్ : 6.85
కర్ణాటక : 6.57
రెస్టాఫ్ ఇండియా : 1.60
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 52.98 కోట్లు (షేర్)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news