ఫ్యాన్సీ రేటుకి ‘ఖైదీ నెంబర్ 150’ శాటిలైట్ రైట్స్.. ‘జనతా గ్యారేజ్’ రికార్డ్ బ్రేక్

khaidi no 150 movie break janatha garage satellite record

Megastar Chiranjeevi’s prestigeous project Khaidi No 150 movie satellite rights sold for bomb price. This is the highest price in this year than Janatha Garage.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. కలెక్షన్లపరంగా కొన్ని ఏరియాల్లో గత రికార్డ్స్‌ని బ్రేక్ చేసి.. మరికొన్ని ఏరియాల్లో ఆల్‌టైం రికార్డ్ సృష్టించి.. ఈ ఏడాదిలో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. అంతేకాదు.. రూ.12.50 కోట్లకు శాటిలైట్ రైట్స్ ధర పలికి.. ఆ రేంజ్‌లో అమ్ముడుపోయిన మూవీగానూ మరో అరుదైన ఘనత సాధించింది. ‘ఊపిరి’ మూవీ రూ.14 కోట్లు పలికింది కానీ.. అది తెలుగు, తమిళ్ రెండు భాషలకు కలిపి అంత ధర పలికింది. కానీ.. ‘గ్యారేజ్’ తెలుగులో మాత్రమే రూ.12.50 కోట్ల ధరకు సోల్డ్ అవ్వడంతో.. ఈ సంవత్సరంలో అదే ఎక్కువ రేటుకి అమ్ముడుపోయిన చిత్రం రికార్డ్ సాధించింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ని మెగాస్టార్ చిరంజీవి తన ప్రతిష్టాత్మక చిత్రంతో బద్దలుకొట్టేశాడు.

వివి వినాయక్ దర్శకత్వంలో చిరు చేస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’వ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఆయన వెండితెరపై రీఎంట్రీ ఇస్తుండడంతో.. విడుదలకు ముందే ఎన్నో ఘనతలు సాధిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, సాంగ్స్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్, లైక్స్‌తో సంచలన రికార్డ్స్ నమోదు చేశాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా కళ్లుచెదిరే రేంజులో జరుగుతోంది. ఇప్పుడు శాటిలైట్ రైట్స్‌కి రికార్డ్ స్థాయిలో ధర పలికింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని రూ.13 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. దీంతో.. ఈ ఏడాదిలో అత్యధిక రేటుకి కొనుగోలు చేయబడ్డ ‘జనతా గ్యారేజ్’ శాటిలైట్ రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఈ చిత్రంపై అసాధారణ స్థాయిలో క్రేజ్ నెలకొనడం వల్లే ఇది ఇలా రికార్డ్స్ నమోదు చేస్తోందని అంటున్నారు.

రిలీజ్‌కి ముందే ఈ చిత్రం రికార్డ్స్ సృష్టించడాన్ని చూస్తుంటే.. రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలో ప్రభంజనం సృష్టించడం ఖాయమేనని అంటున్నారు. కాగా.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకని జనవరి 4వ తేదీన ఘనంగా జరిపేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11 లేదా 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment