Ram Charan has broken another record of NTR’s in USA with his latest movie Dhruva. According to the latest report this movie has crossed Baadshah’s collections.
తన తాజా చిత్రం ‘ధృవ’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన రామ్ చరణ్.. గత రికార్డులను ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే తొలి వీకెండ్లో భాగంగా యూఎస్‌లో శనివారంనాడు అత్యధిక వసూళ్లు రాబట్టిన జాబితాలో నాలుగో స్థానం కైవసం చేసుకుని, అంతకుముందు ఆ ప్లేస్‌లో ఉన్న ‘జనతా గ్యారేజ్’ని ఐదో స్థానానికి నెట్టేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌కి సంబంధించిన మరో రికార్డుని చెర్రీ బద్దలుకొట్టేశాడు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘బాద్షా’ సినిమా యూఎస్‌లో టోటల్ రన్లో 1.28 మిలియన్ డాలర్స్‌ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ‘ధృవ’తో చరణ్ అంతకంటే వసూళ్లు రాబట్టి.. ఆ మూవీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు ‘ధృవ’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1.38 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ వస్తుండడంతో.. ఇది 1.5 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
గతంలో మిలియన్ డాలర్ క్లబ్లో చేరేందుకు నానా తంటాలు పడిన చరణ్.. ఇప్పుడు ‘ధృవ’తో ఆ ఫీట్‌ని అందుకోవడంతోపాటు రెండు రికార్డులు కూడా సృష్టించాడు. దీంతో.. మెగాఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మూవీతో యూఎస్‌లో చరణ్ రేంజ్ పెరిగిపోయింది కాబట్టి.. ఇకపై వచ్చే సినిమాలన్నీ కచ్చితంగా 1 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేస్తాయనే నమ్మకం ఏర్పడింది.