‘ఖైదీ నెంబర్ 150’ సెన్సార్ టాక్.. నానా హంగామా చేసిన బోర్డ్ సభ్యులు

khaidi no 150 censor review chiranjeevi ram charan

Megastar Chiranjeevi’s 150th project ‘Khaidi No 150’ has completed his censor formalities recently and it gets U/A certificate.

ముందుగా చెప్పినట్లుగానే సంక్రాంతి కానుకగా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్రబృందం అన్ని కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేస్తోంది. రీసెంట్‌గానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కంప్లీట్ చేసి, ఫస్ట్ కాపీ కూడా రెడీ చేసి పెట్టుకున్న యూనిట్.. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని కంప్లీట్ చేసుకుంది.

సెన్సార్ బోర్డువారు ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ భారీస్థాయిలో ఉండడం వల్లే దీనికి ఆ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. షో అయిపోయిన తర్వాత టీమ్ సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంతోపాటు గట్టిగా క్లాప్ కొట్టారనే రిపోర్ట్ బయటికి వచ్చింది. అంతకంటే ముందు ఇంకో విశేషం కూడా చోటు చేసుకుంది. ఈ మూవీ బోర్డ్‌కి చేరుకున్న మరుక్షణమే.. సెన్సార్ టీం సభ్యులు ‘ఖైదీ నెంబర్ 150’ని చూసేందుకు అమితాసక్తిని ప్రదర్శించారట. సెన్సార్ బృందంలో ఉన్న 18 మంది మొత్తం చిరు సినిమాని చూశారు. ఇలా ఓ సినిమాని సెన్సార్ సభ్యులందరూ చూడడం.. చాలా అరుదు. గతంలో ఎన్నడూలేని హంగామా ఈ చిత్రం విషయంలో బోర్డులో చోటు చేసుకుందని అంటున్నారు.

ఈ రేంజులో బోర్డ్ నుంచి రిపోర్ట్ అందడంతో.. ‘ఖైదీ’ యూనిట్ చాలా సంతోషంగా ఉంది. తమ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాయడం ఖాయమని నమ్మకంగా ఉంది. ఇక ఈ మూవీ రన్‌టైం 147 నిముషాలు (2 గంటల 27 నిముషాలు) ఉన్నట్లు తెలిసింది. రన్‌టైం కూడా ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టే ఉంది కాబట్టి.. ఇందులో బోరింగ్ కొట్టించే ఎలిమెంట్స్ ఏమాత్రం ఉండవని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి.. చిరు రీఎంట్రీతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయంలా కనిపిస్తోంది.

Leave a comment