‘ధృవ’ 12 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్.. మంగళవారం డీలాపడ్డ చరణ్

ram charan dhruva 12 days ap telangana collections

Ram Charan’s latest movie Dhruva 12 days collections are out. On the 12th day this movie earned low amount.

తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద ‘ధృవ’ కలెక్షన్ల దూకుడు తగ్గింది. తొలి వారాంతంలో భారీగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించిన ఈ సినిమా.. ఆ తర్వాత వర్కింగ్ డేస్‌లో డల్ అయినా రెండో వారాంతంలో మళ్లీ ప్రభంజనం సృష్టించింది. గత శుక్రవారం సినిమాలు ఎలాగో ఫ్లాప్ అయ్యాయి కాబట్టి.. ఈ వారంలోనూ‘ధృవ’కలెక్షన్ల సునామీ కొనసాగస్తుందని భావించారు. కానీ.. అలా జరగలేదు. సోమవారం నుంచే ఈ మూవీ వసూళ్లు డల్ అయ్యాయి. ఇక మంగళవారంనాడు మరింత దిగజారిపోయాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం 12వ రోజైన మంగళవారంనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని కేవలం రూ.0.52 కోట్లు కలెక్ట్ చేసింది. డీమోటినిటైజేష్ వల్లే ఈ మూవీ వర్కింగ్ డేస్‌లలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టలేకపోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత 11 రోజుల కలెక్షన్ల (రూ.34.85 కోట్లు)తో మంగళవారం కలెక్షన్లు కలుపుకుంటే.. మొత్తం 12 రోజుల కలెక్షన్స్ రూ.35.37 కోట్లు. ఏరియాలవారీగా కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా వున్నాయి (కోట్లలో)…

నైజాం : 13.07
సీడెడ్ : 5.88
ఉత్తరాంధ్ర : 4.59
గుంటూరు : 3.03
ఈస్ట్ గోదావరి : 2.72
కృష్ణా : 2.57
వెస్ట్ గోదావరి : 2.34
నెల్లూరు : 1.17
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 35.37 కోట్లు (షేర్)

Leave a comment