Moviesతన బ్యానర్‌కి ‘ఊపిరి’ పోసిన డైరెక్టర్ వంశీపైడిపల్లిపైనే పివిపి ఫిర్యాదు

తన బ్యానర్‌కి ‘ఊపిరి’ పోసిన డైరెక్టర్ వంశీపైడిపల్లిపైనే పివిపి ఫిర్యాదు

Tollywood ace producer PVP has lodged complaint in Producers Council against Vamshi Paidipally for not honouring the agreement and also for not giving advance which he taken for Mahesh Babu’s movie.

టాలీవుడ్‌లో భారీ సినిమాలను నిర్మించే బ్యానర్‌లలో ‘పివిపి సినిమాస్’ ఒకటి. ఆ సంస్థ నిర్మించిన సినిమాల్లో చాలావరకు పరాజయాలు పాలవ్వగా.. కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. వాటిలో ‘ఊపిరి’ ఒకటి. అంతేకాదు.. ఆ బ్యానర్‌లో అత్యధిక వసూళ్లు (రూ.100 కోట్లపైనే గ్రాస్) రాబట్టిన చిత్రం కూడా అదే. అంటే.. ఆ మూవీయే ‘పివిపి సినిమాస్’ సక్సెస్ రేట్‌కి కాస్త ‘ఊపిరి’ పోసిందని చెప్పుకోవచ్చు. అలాంటి విజయాన్ని అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లిపైనే పివిపి తాజాగా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. తనకు ఇచ్చిన కమిట్మెంట్‌ను తుంగలో తొక్కినందుకే పివిపి అలా చేశాడు.

అసలు విషయం ఏమిటంటే.. ‘ఊపిరి’ ఘనవిజయం సాధించిన అనంతరం పీవీపీతోనే తన తర్వాతి సినిమా చేస్తానని వంశీ పైడిపల్లి కమిట్మెంట్ ఇచ్చాడు. ఈమేరకు అగ్రిమెంట్ కూడా జరిగిపోయింది. దీంతో.. అతనితో ఓ భారీ సినిమా రూపొందించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే చాలా కష్టపడి మహేష్‌బాబు డేట్స్ సంపాదించాడు. అంతే.. వెంటనే పివిపి ఓ ప్రకటన చేశాడు. వంశీ దర్శకత్వంలో మహేష్ హీరోగా పివిపి సినిమాస్ బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు. ఆ ప్రకటన చేశాక వంశీకి రెమ్యునరేషన్‌లో భాగంగా కొంత అమౌంట్ అడ్వాన్స్‌గా కూడా ఇచ్చాడు. ఇక ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించాడు. స్వయంగానే పివిపినే రచయితల్ని సమకూర్చి.. స్క్రిప్టు వర్కంతా తన కార్యాలయంలోనే జరిగేలా చూశాడు. అయితే.. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. వంశీ పైడిపల్లి స్వయంగా ప్లేటు ఫిరాయించాడు.

పివిపికి ఇచ్చిన కమిట్‌మెంట్‌ని తుంగలో తొక్కేసి.. దిల్‌రాజు, అశ్వినీదత్‌లతో చేతులు కలిపాడు. ఈ విషయాన్ని తానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మహేష్‌తో తాను చేయబోయే తదుపరి చిత్రం పివిపి నిర్మాణంలో ఉండదని.. దిల్‌రాజు, అశ్వినీదత్‌ల నిర్మాణంలో ఉంటుందని ప్రకటించాడు. అలాగే.. మహేష్ సినిమా కోసం పివిపి దగ్గరనుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో.. తనకిచ్చిన కమిట్‌మెంట్‌ని బ్రేక్ చేయడంతోపాటు అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోవడంతో పివిపి అతనిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news