సాంగ్ టాక్ : ‘ఖైదీ’ని తేనెటీగలా కుట్టేసిన ‘సుందరి’

khaidi no 150 sundari song review

Finally, the second song ‘Sundari’ of Khaidi no 150 is released. This melodious song impress the mega fans.

తమ సినిమాని ఆడియెన్స్‌లోకి తీసుకెళ్ళాలంటే.. వినూత్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలి. కేవలం పోస్టర్లు, ట్రైలర్ రిలీజ్ చేస్తే సరిపోదు.. ఈరోజుల్లో అంతకుమించే చేయాలి. అప్పుడే.. ఆడియెన్స్‌లో సినిమాపట్ల మరింత క్యూరియాసిటీ పెంచవచ్చు. స్టార్ హీరో సినిమాలైనా సరే.. విభిన్నంగా ప్రమోట్ చేయాల్సిందే. ఈ విషయాన్ని బాగా గ్రహించిన ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ యూనిట్.. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగానే ప్రమోట్ చేస్తోంది. షూటింగ్‌ సమయంలో కేవలం పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేసిన చిత్రబృందం.. షూటింగ్ ముగించుకున్నాక డిఫరెంట్ స్టైల్‌లో ప్రమోట్ చేస్తూ వస్తోంది.

అందులో భాగంగానే రీసెంట్‌గా ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అనే సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ పాటకి అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ఏకంగా 5 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి.. ఇంతవరకు తెలుగులో ఏ ఆడియో సాంగ్ సృష్టించని అరుదైన రికార్డ్‌ని సాధించింది. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా చిత్రబృందం మరో సింగిల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈరోజు (24-12-2016) సాయంత్రం ఆరు గంటలకు ‘సుందరి’ అనే పాటని రిలీజ్ చేశారు. ఈ పాట ట్యూన్స్ చాలా ఫ్రెష్‌గా, వినసొంపుగా ఉన్నాయి. లిరిక్స్ కూడా అర్థవంతంగా ఉన్నాయి. తొలిపాటతో కాపీ చేశాడన్న ఆరోపణ ఎదుర్కొన్న దేవి.. ఈసారి కాస్త డిఫరెంట్ ట్యూన్స్ అందించి అందరినీ ఆకట్టుకున్నాడు.

Leave a comment