Moviesరామ్‌చరణ్‌పై ‘సెక్సీ’ కామెంట్ చేసిన మంచి విష్ణు

రామ్‌చరణ్‌పై ‘సెక్సీ’ కామెంట్ చేసిన మంచి విష్ణు

We know how Manchu family is so different than other celebrities in the Tollywood. In any situation they do different comments which create sensation in the industry. Now Manchu Vishnu turned has come. Recently he made sexy comment on Ram Charan which going viral.

‘మాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’.. ఈ డైలాగ్ మంచు ఫ్యామిలీకి కరెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వారి వ్యవహారశైలియే ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తుంది. అలాగని వారిని తిడుతున్నట్లు కాదండోయ్! అందరి ఆలోచన విధానం ఒకరకంగా ఉంటే.. మంచువారికి మరోలా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా.. తాజాగా రామ్ చరణ్‌పై మంచువిష్ణు చేసిన కామెంట్స్‌నే తీసుకోవచ్చు.

రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ధృవ’ ఈనెల 9వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం రీసెంట్‌గా కొన్ని ఫోటోలను విడుదల చేసింది. వాటిలో చరణ్‌ సిక్స్ ప్యాక్ బాడీలో ఉన్న ఫోటో హైలైట్ అయ్యింది. సెలబ్రిటీందరూ ఆ ఫోటోపై రకరకాల అభిప్రాయాలు వెల్లడించారు. అయితే.. ఒక్క మంచి విష్ణు మాత్రం చాలా డిఫరెంట్‌గా తన ఒపీనియన్ వెల్లడించాడు. అది చూస్తే.. ప్రతిఒక్కరూ ‘వారెవ్వా విష్ణు’ అనక మానరు.

ఇంతకీ విష్ణు ఏమన్నాడంటే.. ‘చరణ్ లుక్ చాలా సెక్సీగా ఉంది. దీన్ని కాక సెక్సీ అని దేన్ని అంటారో నేను చెప్పలేను. డెడికేషన్‌తోనే ఇది సాధ్యం అవుతుంది’ అంటూ పొగడ్తల వర్షం కురిపించేశాడు. ప్రతిఒక్కరూ లుక్ అదిరింది, కేక అంటూ కామెంట్స్ చేస్తుంటే.. విష్ణు మాత్రం పై విధంగా డిఫరెంట్‌గా ట్వీట్ చేసి వార్తల్లోకెక్కాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news