Moviesపాపం.. నానికి ‘లోకల్’ కష్టాలు అన్నీఇన్నీ కావయా!

పాపం.. నానికి ‘లోకల్’ కష్టాలు అన్నీఇన్నీ కావయా!

After five consecutive successes Natural star nani facing problems for his sixth project “Nenu Local”. First unit decide to release their movie on 23rd December, but due to some problems they postponed. Now they are searching for a good date.

గత రెండేళ్లలో వరుసగా ఐదు విజయాలు అందుకుని ఈతరం హీరోల్లో తిరుగులేని రికార్డ్ సృష్టించిన నేచురాల్ స్టార్ నాని.. తాజాగా కొత్త చిక్కుల్లో పడ్డాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘నేను లోకల్’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలా? అనే ఆలోచనలో పడిపోయాడు. ఇప్పటివరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకొచ్చిన తనకు.. ఉన్నట్లుండి చుక్కెదురు అవడంతో నానాతంటాలు పడుతున్నాడు.

నిజానికి.. లోకల్ చిత్రాన్ని ఈనెల 23వ తేదీనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ.. ‘ధృవ’ 9న రిలీజ్ అవుతున్న సందర్భంగా సూర్య తన ‘సింగం-3’ మూవీని 23న వాయిదా వేసుకోవడంతో నాని చిత్రాన్ని తప్పకుండా వాయిదా వేయాల్సి వచ్చింది. పైగా.. కరెన్సీ కొరత కూడా కలెక్షన్లపై ఎక్కడా ప్రభావం చూపుతుందోనన్న భయంతో యూనిట్ వెనకడుగు వేసింది. ఇప్పుడు తమ మూవీన ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందా? అని యూనిట్ యోచిస్తోంది.

ప్రస్తుతమున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. సోలోగా రిలీజ్ చేస్తేనే కలెక్షన్స్ బాగొస్తాయని, అప్పుడే సేఫ్‌గా బయటపడొచ్చని చిత్రటీం ఆలోచిస్తోంది. అయితే.. సింగిల్‌గా రిలీజ్ చేయడానికి ఇప్పట్లో డేట్స్ ఖాళీగా లేవు. జనవరిలో ఏకంగా టాలీవుడ్ లెజెండ్స్ బాలయ్య, చిరంజీవిలు తమ ప్రతిష్టాత్మక చిత్రాల ద్వారా బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. వారిమధ్య తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తే.. నలిగి పోవడం ఖాయమని చాలామంది వాయిదాలు వేసుకున్నారు.

‘నేను లోకల్’ టీం కూడా ఆ లోచనతోనే బ్యాక్ స్టెప్ వేసింది. ఇక జనవరి 26న వెంకీ ‘గురు’ చిత్రం, ఆ తర్వాత ఫిబ్రవరిలోనూ ఇతర సినిమాలో బరిలో ఉన్నాయి. దీంతో.. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ఫస్ట్ వీక్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. చూద్దాం.. ఈ లోకలోడు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తాడో?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news