మంచులక్ష్మిపై మరో ఫన్నీ వీడియో.. చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు!

manchu lakshmi nene interview spoof video

Another spoof video of Manchu Lakshmi going viral on youtube. Recently Lakhsmi has given a self interview on news channel which is named as Nene which entertained everyone. On that interview creators has made a spoof.

స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని కొందరు క్రియేటర్స్ రకరకాల స్పూఫ్ వీడియోలు క్రియేట్ చేస్తుంటారు. సీరియస్‌గా ఉండే సీన్లను కూడా ఫన్నీగా చూపిస్తూ.. నెటిజన్లను నవ్విస్తుంటారు. తమ తెలివిని బాగా ఉపయోగించి.. చాలా కామెడీగా వీడియోల్ని సృష్టిస్తారు. ఇప్పుడు వీళ్లంతా మంచులక్ష్మి మీద పడ్డారు. ఆమెకి సంబంధించిన ఇంటర్వ్యూలుగానీ, టీవీ షోలుగానీ, మరే ఇతర కార్యక్రమాలుగానీ వస్తే.. అప్పటికప్పుడే ఫన్నీ వీడియోలు రెడీ చేసేస్తున్నారు. ఆమెకి సంబంధించిన వీడియోలు ఏమైనా వస్తాయా? ఎప్పుడెప్పుడు స్పూఫ్‌లు చేద్దామా? అంటూ వెయ్యికళ్లతో వేచి చూస్తుంటారు.

ఇలా వెయిట్ చేస్తున్న వీరికి.. తాజాగా మంచులక్ష్మికి సంబంధించి ‘నేనే’అనే ఓ ఇంటర్వ్యూ దొరికింది. ఇంకేముందు.. మరోసారి తమ క్రియేటివిటీని అంతా ఉపయోగించి.. ఓ కామెడీ వీడియోని తయారుచేశారు. వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. అప్పటినుంచి అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి పగలబడి నవ్వుకుంటారు. ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోని లక్షమందికి పైగా వీక్షించారంటే.. ఇది ఏ రేంజులో నెటిజన్స్‌ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. మీరూ ఓసారి ఆ వీడియో చూసి.. బాగా నవ్వుకోండి.

Leave a comment