Finally, the most awaited song of Khaidi Number 150 song “Ammadu Lets Do Kummudu” released. Let’s see how it is?
ప్రతి మూవీలోనూ హీరో-హీరోయిన్ల మధ్య ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ని దృష్టిలో పెట్టుకుని.. వాళ్లని ఉర్రూతలూగించేలా పక్కా మాస్ బీట్‌తో ఓ సాంగ్ రెడీ చేస్తారు. ఈ ప్లాన్ బాగానే ఉంది కానీ.. చాలామంది రొటీన్ ట్యూన్స్‌నే ఫాలో అయిపోతున్నారు. ఆల్రేడీ గతంలో సెన్సేషన్ క్రియేట్ పాటలనే కాస్త అటుఇటు మార్చి.. కొత్త సాంగ్ అంటూ మార్కెట్‌లో దించేస్తున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ యూనిట్ కూడా అదే పని చేసింది.
‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అనే ఓ మాస్ పాటని రిలీజ్ చేస్తున్నామని ఆ చిత్రబృందం ప్రకటించగానే.. ఫ్యాన్స్‌తోపాటు సినీజనాలు కూడా దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి, భారీ అంచనాలే నెలకొన్నాయి. ‘కాపీ పేస్ట్’ ట్రెండ్ నడుస్తున్న ఈ కాలంలో కొత్తకొత్త ట్యూన్స్ అందించడంలో దేవి స్పెషలిస్ట్ కాబట్టి, చిరు ప్రతిష్టాత్మక మూవీకి డిఫరెంట్ ట్యూన్సే ఇచ్చి ఉంటాడని భావించారు. ఈ మాస్ సాంగ్ కొత్తగా ఉంటుందని, మాంచి ఊపిస్తుందని అనుకున్నారు. కానీ.. పాట రిలీజయ్యాక దెబ్బకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏ అంచనాలైతే ఈ పాటపై పెట్టుకున్నారో.. వాటిని రీచ్ అవ్వడంలో సక్సెస్ అవ్వలేదు.
పాట వింటున్నప్పుడు.. ఇదేదో ఆల్రెడీ విన్నట్లుందే అనే ఫీలింగే వస్తుంది. లిరిక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు. స్టార్టింగ్‌లో అదిరిపోయింది కానీ.. ఆ తర్వాత రొటీన్‌గా ఉండడంతో అంతగా కిక్ ఇవ్వలేదు. మధ్యలో వచ్చే ఓ ట్యూన్ బాగుంది కానీ.. ఆ తర్వాత వచ్చే రొటీన్ ట్యూన్ ఆ మూడ్‌ని డైవర్ట్ చేస్తుంది. అక్కడక్కడ బీట్స్ ఎలా ఉన్నాయంటే.. ‘పక్కా లోకల్’, ‘సరైనోడు’లోని ‘బ్లాక్‌బస్టర్’ సాంగ్స్ మిక్స్ చేసి వింటున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే.. దేవిశ్రీప్రసాద్ పాత చింతకాయ పచ్చడినే దంచేశాడని స్పష్టంగా అర్థం అవుతోంది. ఆడియో పరంగా అంతగా ఆకట్టుకోలేదు. మరి.. విజువల్‌గా ఎలా ఉంటుందో చూడాలి.