బాలయ్య సునామీ ముందు కొట్టుకుపోయిన ‘ధృవ’, ‘ఖైదీ’ల రికార్డ్స్

gautamiputra satakarni trailer break dhruva khaidi records on youtube

Balayya’s 100th film Gautamiputra Satakarni trailer has broken the records of Dhruva trailers and Khaidi teasers.

బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో దాని హవానే కొనసాగుతోంది. క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతున్న ఈ మూవీపై ముందునుంచే భారీ అంచనాలు ఉండడం, అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్ నిండివుండడంతో.. అది సామాజిక మాధ్యమాల్లో రికార్డుల సునామీ సృష్టిస్తోంది. దీని దెబ్బకు గత రికార్డులు పత్తాలేకుండా కొట్టుకుపోయాయి.

తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం.. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన తెలుగు ట్రైలర్లలో ‘శాతకర్ణి’నే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అంతకుముందు రామ్ చరణ్ తన లేటెస్ట్ ఫిల్మ్ ‘ధృవ’ ట్రైలర్‌లో మొదటి స్థానంలో ఉండేవాడు. ఆ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే 2.05 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అప్పటివరకు ఇదే హయ్యెస్ట్. కానీ.. ‘శాతకర్ణి’ ట్రైలర్‌తో బాలయ్య ఆ రికార్డ్‌ని తుడిచిపెట్టేశాడు. ఈ ట్రైలర్‌కి కేవలం 24 గంటల్లో 2.13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు.. 60 వేలకుపైగా లైక్స్ కూడా వచ్చాయి. ‘శాతకర్ణి’ సునామీ ముందు కేవలం ‘ధృవ’నే కాదు.. ‘ఖైదీ’ టీజర్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయిపోయాయి. దీన్ని బట్టి.. ‘శాతకర్ణి’ మూవీపై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కాగా.. ఈనెల 26వ తేదీన ఈ మూవీ ఆడియో వేడుకని యూనిట్ ఘనంగా నిర్వహించబోతోంది. ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేలా ప్లాన్ వేశారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఓ రేంజులో క్రేజ్‌ నెలకొనడంతో.. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.

24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్, టీజర్స్ :
#GPSK Trailer – 2.13M
#Dhruva Trailer – 2.05M
#k150 Teaser – 1.68M
#JG Trailer – 1.50M
#JG Teaser – 1.47M

Leave a comment