Megastar Chiranjeevi’s prestigeous project Khaidi no 150 movie video song leaked and going viral on social media.
ఈమధ్య యూనిట్ మెంబర్లు తమ సినిమాల షూటింగ్ సమయంలో కొన్ని క్లిప్స్‌ని సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓ ఆనవాయితీ అయిపోయింది. రీసెంట్‌గానే యాక్టర్ బ్రహ్మాజీ ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి.. 10 సెకన్ల వీడియోని ఫేస్‌బుక్, ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ తెగ హల్‌చల్ చేశాడు. దాంతో.. అతనికి క్రేజ్‌తోపాటు సినిమాకి ఫ్రీ-ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ‘ఖైదీ నెం.150’ చిత్రబృందం కూడా అదే బాట పడుతున్నట్లు కనిపిస్తోంది.
రీసెంట్‌గానే చిత్రబృందం చిరంజీవి, కాజల్ అగర్వాల్‌పై ఓ పాట చిత్రీకరించగా.. అక్కడే ఉన్న యూనిట్ మెంబర్స్‌లో ఒకరు తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి, ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. లీకైన ఈ పాటకి సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో కాజల్ వయ్యారాలుపోతూ నడుము ఊపుతు స్టెప్ వేయగా, అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న చిరు ఒక్కసారిగా ఆమె నడుముని చుట్టేసి స్టెప్ కలిపారు. చిరు ఇచ్చిన ఆ యాక్షన్ చూస్తే.. గతంలో ఉన్న ఎనర్జీనే ఇప్పటికీ ఆయనలో కనిపిస్తుంది. తాను చెప్పిన డైలాగ్‌లాగే.. టైమ్‌లో గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే కానీ, టైమింగ్‌లో ఏమాత్రం ఛేంజ్ లేదు.
కాగా.. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం పాటల్ని ఈనెల 25వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చాలాకాలం తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తుండడంతో.. ఈ చిత్రం గత రికార్డుల్ని తిరగరాస్తుందని భావిస్తున్నారు.