Khaidi No 150 movie audio event is in problem becauase of venue issue.
మెగాస్టార్ చిరంజీవీ కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ అన్ని కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేసుకుంటోంది. రీసెంట్‌గానే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ మూవీ ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించడం కోసం చిత్రబృందం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 25 లేదా 30వ తేదీన పాటల్ని రిలీజ్ చేయాలనుకున్న యూనిట్.. అందుకు వేదికగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంని ఎంపిక చేసుకుంది కూడా. అక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే.. ఇంతలోనే యూనిట్‌కి సరికొత్త చిక్కొచ్చి పడింది.
అదేమిటంటే.. 2015లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ మునిసిపల్ స్టేడియంలో కేవలం ఆటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్‌నే నిర్వహించాలి. ఇతర వేడుకలను జరపకూడదు. వేరే ఈవెంట్లు నిర్వహించుకునేందుకు జిల్లా కలెక్టర్ కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. ఒకవేళ ఏదైనా ఈవెంట్ చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే.. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంపై ఎవరైనా కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే.. ‘ఖైదీ’ వేడుక ఆ స్టేడియంలో జరపకూడదని ఎవరన్నా కోర్టు మెట్లే అవకాశం ఉందన్నమాట. అయితే.. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీఈఓ పున్నయ్య చౌదరి చెబుతున్న మాటలు మాత్రం మరోలా ఉన్నాయి. 1974 నుండి ఈ గ్రౌండ్ సినిమా ఫంక్షన్లకి వాడుతున్నామని, అలాంటిది చిరంజీవి రేంజ్ సెలబ్రిటీకి ఆ స్టేడియం ఇవ్వడం తప్పు కాదని అంటున్నారు.
అయితే.. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ స్టేడియో ‘ఖైదీ’ సినిమా ఫంక్షన్‌కి ఇవ్వడం కోర్టు ఆర్డర్‌ని ధిక్కరించినట్లే అవుతుంది. ఏపీ సీఎం లెవెల్లో ఓ ప్రత్యేక పర్మిషన్ ఉన్నప్పటికీ.. కోర్టుకు ఎక్స్‌ప్లెనేషన్ ఇచ్చుకుని ఆ తర్వాత ఫంక్షన్ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మరి.. ఈ పర్మిషన్‌ని ‘ఖైదీ’ యూనిట్ తీసుకుందా? లేదా? అన్నది సస్పెన్స్. ఒకవేళ తీసుకోకపోయి ఉంటే.. ఈ ఫంక్షన్ ఆ గ్రౌండ్‌లో జరగడం కష్టమేనని చెబుతున్నారు. దీంతో.. మెగాఫ్యాన్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిరుకి.. ఈ కష్టాలేంటోనని టెన్షన్ పడుతున్నారు.