Gossipsఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఆయనతో మూవీ ఇప్పట్లో లేనట్లే!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఆయనతో మూవీ ఇప్పట్లో లేనట్లే!

From the past few months a rumour going viral that Rajamouli will work with NTR after Baahubali: The conclusion Shooting which is a great news for Tarak fans. But according to latest updates, Jakkanna planning to do with a bollywood hero.

‘బాహుబలి-2’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేస్తాడని గతకొంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ పౌరాణిక చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని, ఇది మల్టీస్టారర్ అని కూడా చెబుతున్నారు. ‘బాహుబలి-2’ రిలీజైన వెంటనే జక్కన్న ఈ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్తాడని, ఈ సినిమా కోసం మూడేళ్ల షెడ్యూల్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నాడని ప్రచారం జరుగుతూ వస్తోంది.

సాధారణంగా ఏదైనా ఓ రూమర్ వస్తే జక్కన్న వెంటనే దానిపై క్లారిటీ ఇచ్చేస్తాడు. అలాంటిది.. ‘గరుడ’ ఎంతోకాలం నుంచి రకరకాల వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నా వాటిని ఖండించడం లేదు. అలాగని క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో.. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని, అందుకే రూమర్లపై జక్కన్న సైలెంట్‌గా ఉన్నాడని ఫ్యాన్స్‌తోపాటు సినీ జనాలు కూడా అనుకుంటున్నారు. కానీ.. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఉండదని తెలుస్తోంది. అవును.. జక్కన్న తన నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్‌తో కాదు, ఓ బాలీవుడ్ హీరోతో హిందీ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడట. ఆ బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ అనే టాక్ వినిపిస్తోంది.

ఈమధ్య ఆమిర్, జక్కన్నల మధ్య తరుచుగా కొన్ని మీటింగ్స్ జరగడంతో.. వీరి కాంబోలో మూవీ ఉంటుందన్న రూమర్‌కి బలం చేకూరింది. మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే జక్కన్న క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఈ రూమర్ నిజమే అయితే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి చేదువార్తే అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news