Newsభార్య ఆ పని చేసిందని.. కిరాతకంగా చంపిన భర్త.. ఆపై!

భార్య ఆ పని చేసిందని.. కిరాతకంగా చంపిన భర్త.. ఆపై!

Dentist Umesh babole brutally killed his wife Tanuja for one reason. Read full story to know the details.

చిన్న చిన్న కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోవడం, లేదా మర్డర్ చేయడం వంటి ఘటనలు ఈమధ్య మరింత పెచ్చుమీరిపోయాయి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడితే పరిష్కారమయ్యే సమస్యని.. కోపంతో రగిలిపోతూ మరింత పెద్దతి చేస్తున్నారు. ఫలితంగా.. విడాకులు తీసుకోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో లేదా ఎవరోఒకరు చంపుకోవడమో చేస్తున్నారు. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనపై గృహహింస చట్టం కింద కేసు పెట్టిందనే నెపంతో.. తన భార్యని ఓ భర్త అత్యంత కిరాతకంగా చంపాడు. ఈ ఘటన ముంబయిలోని కోహీనూర్ టవర్స్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. డెంటిస్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఉమేష్ బాబోలే(38), తనుజా(36) అనే మహిళతో ఏడేళ్ళ క్రితం వివాహం అయ్యింది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. పెళ్ళయినప్పటి నుంచే ఆ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ వుండేవి. దాంతో.. తనుజా తన పుట్టింటికి వెళ్ళడం, పెద్ద సర్దిజెప్పి మళ్ళీ ఇద్దరిని ఒక్కటి చేయడం జరుగుతూ వస్తోంది. కొన్ని నెలల క్రితం ఓసారి ఉమేష్ తన భార్య తనుజాని తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇక తనవల్ల కాదనుకున్న ఆమె.. తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కుటుంబసభ్యుల సహకారంతో భర్తపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. అప్పటినుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. భర్త మాత్రం తనపై కేసు పెట్టిందనే ఉద్దేశంతో భార్యపై పగ పెంచుకుంటూ వచ్చాడు.

గత శనివారం ఓ పని నిమిత్తం తనుజా భర్త ఉమేష్ వద్దకు వచ్చింది. ఆరోజంతా ఏమయ్యిందో తెలీదు కానీ.. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మొదలయ్యింది. అంతే.. కోపంతో ఊగిపోయిన ఉమేష్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని తనుజాని అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు. ఆపై మూడు గంటలపాటు శవం పక్కనే కూర్చొని.. పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఉమేష్‌ని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపారు. తనపై గృహహింస చట్టం కింద కేసు పెట్టినందుకు ఉమేస్ తన భార్య తనుజాని చంపి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news