ఎన్టీఆర్-బాబీ-కళ్యాణ్ రామ్ మూవీ.. 45, 65 కాదు.. ఓవరాల్‌గా 100?

kalyan ram to invest 100 crores budget for ntr bobby project

A shocking news going viral on NTR-Booby project on film industry. According to the latest updates, Kalyan Ram to invest 100 crores on this film under his own banner NTR Arts.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ 27వ ప్రాజెక్ట్ ఉంటుందని, ఈ చిత్రం తమ బ్యానర్‌లో నిర్మితమవుతుందని నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం సెట్స్ మీదకి ఎప్పుడు వెళుతుందో సరైన క్లారిటీ లేదు కానీ.. ఇండస్ట్రీలో దీని బడ్జెట్ విషయమై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీకి బడ్జెట్‌గా కళ్యాణ్ ఓ అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాడని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదని బాబీకి సూచించాడని మొదట్లో టాక్ వినిపించింది. గతంలో కళ్యాణ్ తన సొంత బ్యానర్‌లో తీసిన సినిమాల్లో చాలావరకు పరాజయాలు కావడంతో తీవ్ర నష్టాల్లో మునిగి ఉన్నాడని, అందుకే తన తమ్ముడితో తీయనున్న చిత్రానికి రూ.45 కోట్లు మాత్రమే కేటాయించాలని ఫిక్స్ అయ్యాడని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. పైగా.. తారక్ కూడా తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నాడు కాబట్టి, ఆ అమౌంట్‌లో ఈ చిత్రాన్ని తీసేయొచ్చని అందరూ చెప్పుకున్నారు.

ఇంతలోనే ఈ మూవీ బడ్జెట్ రూ.65 కోట్లకు పెరిగినట్లు పుకార్లు షికారు చేశాయి. కాస్త లావిష్‌గానే తీయాలనుకుని.. కళ్యాణ్ 20 కోట్లు బడ్జెట్ పెంచాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ ఏకంగా రూ.100 కోట్లకు పెరిగినట్లు సమాచారం. తొలిసారి తారక్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌పై చేస్తున్నాడు కాబట్టి.. అత్యంత భారీ బడ్జెట్‌తో చాలా స్టైలిష్‌గా, హుందాగా నిర్మించాలని భావించి.. కళ్యాణ్ ఒకేసారి అంత అమౌంట్ పెంచాడని టాక్ నడుస్తోంది. బాబీ ఇచ్చిన భరోసా మేరకే రామ్ అంతలా బడ్జెట్ ఫిగర్ పెంచేశాడని చెప్పుకుంటున్నారు.

అంతేకాదు.. ఈ మూవీలో కళ్యాణ్‌రామ్‌తోపాటు హరికృష్ణ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారని యూనిట్ వర్గాల్లో పుకార్లు చక్కర్లు కొడుతోంది. మరి.. బడ్జెట్, నందమూరి హీరోల కీలక పాత్రలపై వస్తున్న రూమర్లు ఎంతవరకు నిజమో తెలియాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Leave a comment