Singer Geetha Madhuri reveals the other side of sensational director Ram Gopal Varma by video message. This video stunned every one and going viral on social media.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలుసు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చిమరీ కాంట్రవర్సీని తెరలేపడంలో తనకుతానే సాటి. ఎదుటివ్యక్తి భావాలతో సంబంధం లేకుండా ఫ్రాంక్‌గా మాట్లాడుతాడు. సినిమా కోణంలో చూస్తే.. హీరోయిన్లతో చాలా ఎక్స్పోజింగ్ చేయిస్తాడు. బూతు సినిమాల్ని తలపించేరీతిలో ఎక్కువ హాట్నెస్ నింపేస్తాడు. ఇంకా ఈయన గురించి జనాలందరూ ఎన్నోరకాలుగా చెప్పుకుంటూనే ఉంటారు.
ఓవరాల్‌గా.. బయటి ప్రపంచానికి ఆయనపై వ్యతిరేక స్వభావమే ప్రతిఒక్కరిలోనూ ఉంది. మరి.. పరిశ్రమలో వర్మ ఇమేజ్ ఏంటి? ఆయన వ్యవహర శైలి ఎలా ఉంటుంది? వీటికి సింగర్ గీతామాధురి సమాధానం ఇచ్చింది. వ్యక్తిగతంగా వర్మ నడవడిక ఎలాంటిదో వెల్లడించింది. రాంగోపాల్ వర్మ ఎంతో మర్యాదస్తుడని, తన ఫీలింగ్స్‌ని ఫ్రాంక్‌గా వెల్లడించినప్పటికీ అవతలి వాళ్ళకి మర్యాద ఇస్తారని గీతా తెలిపింది. ఇంకా మరెన్నో విషయాలను ఓ వీడియో సందేశం ద్వారా గీతా పేర్కొంది. వర్మ గురించి గీతా ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే..
‘రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘అప్పల్రాజు’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ తదితర సినిమాల్లో నేను పాటలు పాడాను. ఆయన నిజంగా చాలా మర్యాదస్తుడు. పాటలు పాడేందుకు వెళ్లినపుడు ఆయన నాతో చాలా బాగా మాట్లాడేవారు. తన అభిప్రాయాల్ని ఫ్రాంక్గానే చెప్పినా.. అవతలి వాళ్లకి మర్యాద ఇస్తారు. అలాగే వర్క్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంటుంది. ఎదుటి వారి నుంచి ఏమి ఆశిస్తున్నారో క్లియర్‌గా చెబుతారు. ఆయనతో మరిన్ని సినిమాలకు పనిచేయాలని కోరుకుంటున్నాను’ అని గీతామాధురి చెప్పింది.
వర్మ సినీ జర్నీపై ‘శివ టు వంగవీటి’ అనే ప్రోగ్రామ్ మంగళవారం జరగ్గా.. ఎందరో ప్రముఖులు పలువురు సినీ ప్రముఖులు హాజరై వర్మతో తమకున్న అనుబంధం గురంచి మాట్లాడారు. అయితే.. ఈ ఈవెంట్‌కి హాజరుకాలేకపోయిన సింగర్ గీతామాధురి ఓ వీడియో ద్వారా వర్మ గురించి పై విధంగా మాట్లాడింది.
https://youtu.be/NFcE8ebYS58