Movies టాలీవుడ్‌లో ఎన్టీఆరే బెస్ట్ డ్యాన్సర్.. లైవ్‌ చాట్‌లో ఠక్కున చెప్పిన...

టాలీవుడ్‌లో ఎన్టీఆరే బెస్ట్ డ్యాన్సర్.. లైవ్‌ చాట్‌లో ఠక్కున చెప్పిన సమంత

In a facebook livechat, Samantha says NTR is the best dancer amongst all telugu heroes in Tollywood. She also said he is very good person and also wants to do movie with him.

టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే.. ప్రతిఒక్కరూ ఠక్కున యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరే చెబుతారు. ఈ పోటీలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఉన్నప్పటికీ.. చాలామంది సెలబ్రిటీలు మాత్రం తారక్‌కే ఎక్కువ మార్కులు వేస్తారు. ఎందుకంటే.. కొరియోగ్రాఫర్ స్టెప్పులు ఎలా వేయాలని శిక్షణ ఇస్తున్నప్పుడే వాళ్లు చేసే స్టెప్పులు చూసి, అప్పటికప్పుడే తారక్ చేసేస్తాడు. మహాఅయితే ఒకటి లేదా రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తాడంతే. మిగతా హీరోలు మాత్రం కంపల్సరీ శిక్షణ తీసుకుంటారు. అంతేకాదు.. తారక్ వేసే మూవ్‌మెంట్స్ ఎంత వేగంగా ఉంటాయంటే, చివరికి కొరియోగ్రాఫర్స్ కూడా వాటిని అందుకోలేరు. అందుకే.. బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే తారక్ పేరే చెబుతారు.

తాజాగా సమంత కూడా ఎన్టీఆరే టాలీవుడ్‌లో బెస్ట్ హీరో అంటూ కితాబిచ్చింది. ఈరోజు (21-12-2016) సాయంత్రం 4 గంటలకు సమంత ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి రాగా.. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెని బెస్ట్ డ్యాన్సర్ ఎవరని ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా ఎన్టీఆర్ అని ఠక్కున రిప్లై ఇచ్చింది. అలాగే.. తారక్ మంచి వ్యక్తి అని, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని, అతనితో మరోసారి జతకట్టేందుకు తాను రెడీ అని చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news