Movies ‘శాతకర్ణి’ ట్రైలర్ టాక్ : ఏదేమైనా మీసం తిప్పుదాం

‘శాతకర్ణి’ ట్రైలర్ టాక్ : ఏదేమైనా మీసం తిప్పుదాం

Finally, the most awaited film Gautamiputra Satakarni trailer has been released and it is just amazing. Every frame of this video will give goosebumps. Director Krish has edited very well and picturised with high technical values.

నందమూరి ఫ్యాన్స్‌తోపాటు సినీజనాలు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యూనిట్ శుక్రవారం సాయంత్రం ట్రైలర్‌ని గ్రాంగ్‌గా విడుదల చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మొత్తంలో 100 థియేటర్లలో రిలీజ్ చేసి.. ఈ మూవీ యూనిట్ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

బాలయ్య మార్క్‌ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్.. విజువల్ వండర్‌గా ఉంది. ఫస్ట్ షాట్‌లోనే భారీఎత్తున కనిపించే బోట్స్ క్లిప్ ఔరా అనిపించేలా ఉంది. పెద్ద పెద్ద భవంతులు, లక్షలాది మంది సైనికులు నడిచొచ్చే సీన్లు చూస్తే.. ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన ఔట్‌పుట్ రాబట్టినందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ షాట్స్ అనంతరం.. రౌద్రుడిలా పరిగెత్తుకుంటూ వస్తూ బాలయ్య ఇచ్చిన ఎంట్రీకి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చేతకట్టి పట్టుకుని శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడే సీన్‌కి ఉర్రూతలూగాల్సిందే. ఆ తర్వాత ట్రైలర్ కాస్త రొమాంటిక్ యాంగిల్‌లోకి టర్న్ తీసుకుంటుంది.

దీని తర్వాత వచ్చే క్లిప్స్ అన్నీ గూస్‌బంప్సే. ట్రైలర్ ముగుస్తుందన్న సమయంలో బాలయ్య చెప్పే డైలాగులు అదిరాయి. చివర్లో చూపించిన వార్ సీన్స్ కళ్ళు చెదిరేలా ఉంటాయి. ఆ సైన్యం మధ్యలో బాలయ్య చీల్చి చెండాడే పోరాట సన్నివేశాలు చూస్తే.. కేకలు వేయాల్సిందే. శాతకర్ణి మాతగా హేమమాలిని సరిగ్గా సరిపోయారు. ఆమె ఠీవీ, డైలాగ్ చెప్పే తీరు అందరినీ ఆకట్టుకుంటాయి. సెంటిమెంట్ సీన్లు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఓవరాల్‌గా.. ఈ ట్రైలర్ అంచనాలకు మించే ఉంది. ఈ దెబ్బతో చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావడం ఖాయం.

టెక్నికల్ పరంగా చూసుకుంటే.. దర్శకుడు క్రిష్ మేకింగ్‌కి మెచ్చుకోలేక ఉండలేం. ముందుగా చెప్పినట్లుగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించాడని ట్రైలర్ నిరూపించింది. ఇందులో కనిపించే కొన్ని క్లిప్స్ చూస్తే.. వార్ సన్నివేశాల్ని బ్రహ్మాండంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఇక సినిమాటోగ్రఫీకి ఎన్ని మార్కులు వేసినా తక్కువే. ప్రతి ఫ్రేమ్‌ని గ్రాండ్‌గా చూపించారు. చిరంతన్ భట్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.

కాగా.. ఈ మూవీ ఆడియో వేడుకని ఈనెల 26వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అనంతరం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేలా పక్కా ప్రణాళిక రచించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news