In the recent times there was a news went viral that, tamil star director Hari said he don’t know about young tiger NTR. This create sensation in tollywood industry. Everyone shocked with this news and started criticize Hari. After knowing this, he came before media and given clarity about this controversy.
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా ఇప్పుడు మామూలుగా లేదు. ‘టెంపర్’తో హిట్ ట్రాక్‌లోకి వచ్చి, ‘నాన్నకు ప్రేమతో’తో భారీ ఫాలోయింగ్ సంపాదించి, ‘జనతా గ్యారేజ్’తో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. దాంతో.. స్టార్లలో తారక్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో దర్శకనిర్మాతలందరూ ఇతనితో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఇతర భాషా సినిమాల దర్శకులు సైతం పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీ మొత్తం ఇతని నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందా? అని ఆలోచనలో పడిపోయింది. ఇలాంటి టైంలో.. ఓ వార్త తెలుగు చిత్రపరిశ్రమనే హడలెత్తించింది.
‘సింగం’ సిరీస్ డైరెక్టర్ హరి తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదంటూ కామెంట్ చేశాడని ఓ ప్రచారం సంచలనం రేపింది. పడిలేచిన కెరటంలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తిరుగులేని స్టార్డమ్ సంపాదించిన ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరో అతనికి తెలియకపోవడం ఏంటని అందరూ నోళ్ళు వెళ్లబెట్టుకున్నారు. ఇక కొందరైతే ఆ దర్శకుడిపై విమర్శలు కూడా గుప్పించారు. ‘సింగం’ సిరీస్‌తో స్టార్ స్టేటస్ దక్కింది కదా.. అందుకే పొగరు చూపిస్తున్నాడంటూ అతనిపై మండిపడ్డారు. తెలుగు మీడియా కూడా అతనిపై గుర్రుగానే ఉంది. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు హరి.. మరోసారి మీడియా ముందుకు వచ్చి.. ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు.
“ఎన్టీఆర్ ఎవరో తెలియదని నేను చెప్పినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నాకు ఆయన నటనంటే చాలా ఇష్టం. ఆయన చేసిన ‘టెంపర్’ సినిమాని రెండుసార్లు చూశా. ఎన్టీఆర్‌తో పనిచేయాలని కూడా కోరిక ఉంది. ఆ కోరికతోనే ఓసారి ఆయన కలిసినప్పుడు.. ఒక కథ కూడా వినిపించాను. అయితే.. కొన్ని కారణాల వల్ల అప్పుడు అది కుదరలేదు. భవిష్యత్‌లో అవకాశం వస్తే.. ఆయనతో తప్పకుండా ఓ సినిమా చేస్తా’’ అని ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరి తెలిపారు.