బన్నీ ఆల్‌టైమ్ రికార్డ్‌ని బద్దలుకొట్టిన రష్మీ.. బన్నీకి మూడేళ్లు.. రష్మీకి మూడు నెలలే..

Anchor Rashmi Gautam Break Allu Arjun Record

Everyone knows about the craze of Stylish star Allu Arjun in Tollywood. He created many records among the all heroes and some of them are alltime records. Even on youtube there is record on his name. Now anchor Rashmi Gautam has broken that record and create sensation. Mindblowing twist is, Bunny took three years time to achieve that record while Rashmi has taken only three months.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగు చిత్రపరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచే తన టాలెంట్‌తో సత్తా చాటుకుంటూ వస్తున్న ఈ హీరో.. గత నాలుగు వరుస హిట్లతో తన రేంజ్‌ని మరింత పెంచుకున్నాడు. బన్నీ సినిమా అంటే.. రూ.50 కోట్లు (షేర్) మినిమం గ్యారెంటీ అనే స్థాయికి ఎదిగాడు. తెలుగులో మరే హీరో సాధించిన కొన్ని అరుదైన రికార్డుల్ని సైతం తన పేరిట లిఖించుకున్నాడు. అంతటి స్టార్‌డమ్ సంపాదించిన ఈ హీరోకే ఓ టీవీ షోకి యాంకర్‌గా పనిచేసే రష్మీ గౌతమ్ సినిమా చూపించింది. అతడు సాధించిన అరుదైన రికార్డ్‌ని కనుమరుగయ్యేలా చేసింది. అవును.. మీరు చదువుతోంది నిజమే. మరి.. అదేంటో తెలుసుకుందామా..

బన్నీ కథానాయకుడిగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీలోని ‘సినిమా చూపిస్త మావ’ అనే పాట అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ దాని ప్రకంపనలు యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నాయి. దాంతో.. నెటిజన్లు ఈ పాటని విపరీతంగా చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ పాటని 19 మిలియన్స్‌కి పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ రేంజ్‌లో మరే తెలుగు పాటకి వ్యూస్ రాకపోవడంతో.. దీన్ని రికార్డ్‌గా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రికార్డ్‌ని యాంకర్ రష్మీ గౌతమ్ పటాపంచలు చేసేసింది. ఆమె కథానాయికగా నటించిన ‘గుంటూర్ టాకీస్’లోని ‘నీ సొంతం’ అనే పాటకి 20 మిలియన్లకిపైగా వ్యూస్ రావడంతో.. బన్నీ రికార్డ్ కుదేలయిపోయింది. విశేషం ఏమిటంటే.. బన్నీ పాటకి మూడేళ్ళలో అన్ని వ్యూస్ వస్తే.. మూడు నెలల్లోనే రష్మీ సాంగ్‌కి అంతకుమించి వ్యూస్ వచ్చాయి.

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన ‘గుంటూరు సినిమా’ అప్పట్లో మంచి విజయం సాధించడం.. ఆ పాటలో రష్మీ విచ్చలవిడిగా అందాలు ఆరబోయడంతో.. నెటిజన్లు యూట్యూబ్‌పై దండయాత్ర చేశారు. అందుకే.. మూడు నెలల్లోనే 20 మిలియన్స్‌కి పైగా వ్యూస్ సంపాదించి.. తెలుగు పాటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన సాంగ్‌గా చరిత్రపుటలకెక్కింది.

Leave a comment