Ram Charan’s latest movie Dhruva is earning very well at the USA boxoffice in the week days also. According to the latest updates, this movie has earned $25,303 in the sixth day which a good figure for him.
కెరీర్ ప్రారంభం నుంచి రామ్ చరణ్ టాలీవుడ్‌లో సత్తా చాటుకుంటూ వచ్చాడు కానీ.. యూఎస్ఏలో మాత్రం ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఓవైపు కుర్రహీరోలందరూ అక్కడ 1 మిలియన్ క్లబ్‌లో సునాయాసంగా చేరిపోతుంటే.. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ ఆ ఫీట్‌ని అందుకోలేకపోయాడు చరణ్. రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయడం వల్లే ఇతని సినిమాలకి అక్కడి ఆడియెన్స్‌ని ఆకట్టుకోలేకపోయాయి. పైగా.. రెండు వరుస పరాజయాలు చవిచూడడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతని మార్కెట్ డౌన్ అయ్యింది. దీంతో.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని, యూఎస్ఏలోనూ సత్తా చాటాలని భావించి తొలిసారి ‘ధృవ’లాంటి ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశాడు.
తమిళంలో మంచి విజయం సాధించినట్లుగానే తెలుగులోనూ హిట్ అవుతుందని, తన మార్కెట్ వ్యాల్యూని కూడా పెంచుతుందని భావించి.. ఆ సినిమాని చాలా జాగ్రత్తగా చేశాడు. అతను అనుకున్నట్లుగానే రిజల్ట్ వచ్చింది. నటుడిగా ఓ మెట్టు ఎక్కేలా చేయడంతోపాటు.. భారీ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. అంతేకాదు.. యూఎస్ఏలో తన ‘డ్రీమ్’ మార్క్‌ని కూడా క్రాస్ చేయగలిగాడు. ప్రీమియర్లతో కలుపుకుని.. తొలి ఐదురోజుల్లోనే 1 మిలియన్ క్లబ్‌లో చేరిపోయాడు ఈ హీరో. ఈ చిత్రం అక్కడి ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకోవడంతో.. వారు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే.. ఈ చిత్రం వీక్ డేస్‌లోనూ డీసెంట్ కలెక్షన్లతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రీమియర్లతో కలుపుకుని తొలి ఐదురోజుల్లో $1,013,477 గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఆరో రోజైన బుధవారం నాడు $25,303 వసూలు చేసింది. అంటే.. మొత్తం ఆరురోజుల్లో ఈ మూవీ యూఎస్ఏలో $1,038,780 గ్రాస్ రాబట్టిందన్నమాట. ప్రస్తుతం ఈ మూవీ రాబడుతున్న వసూళ్లు చూస్తుంటే.. టోటల్ రన్‌లో 1.3-1.5 మిలియన్ డాలర్ల మధ్య కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
రోజులవారీగా యూఎస్ 6 డేస్ కలెక్షన్స్ :
గురువారం (ప్రీమియర్స్) : $223,835
శుక్రవారం : $245,233
శనివారం : $321,119
ఆదివారం : $149,532
సోమవారం : $31,342
మంగళవారం : $42,416
బుధవారం : $25,303
టోటల్ : $1,038,780