Moviesఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 సినిమాల్లో ‘ధృవ’...

ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 సినిమాల్లో ‘ధృవ’ స్థానం ఇదే!

Dhruva movie has earned only 10.59 collections on it’s first day collections which is very dull for a star hero. Before releasing this movie has got huge craze around the world with which trade analysts thought this movie will smash all records on it’s first day, but it fails to upto the mark.

బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుకోవడం కోసం స్టార్ హీరోలందరూ బాగానే కష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములాని పక్కనపెట్టేసి.. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన కథాచిత్రాలు చేస్తున్నారు. ఇలా రూట్ మార్చిన ప్రతిఒక్కరూ సక్సెస్ అయ్యారు. గతంలో మునుపెన్నడూలేని రికార్డులను సృష్టిస్తున్నారు. పోటాపోటీగా దూసుకెళుతున్నారు. అయితే.. ఒక్క రామ్ చరణ్ మాత్రం రొటీన్ ఫార్ములాని కొనసాగిస్తూ వస్తుండడంతో, ‘మగధీర’ తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ దక్కలేదు. అందుకే.. ఈసారి తను కూడా ఇతర హీరోల బాటలో నడిచాడు. తొలిసారి ‘ధృవ’ అనే ప్రయోగాత్మక చిత్రం చేశాడు.

గతకొన్నాళ్ల నుంచి సరైన హిట్ లేక వరుస పరాజయాలతో సతమతమైన చెర్రీ.. ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలన్న ఆశయంతో ‘ధృవ’లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. దాంతో.. ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్స్ చాలా ఎట్రాక్టివ్‌గా ఉండడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చేసింది. దీంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని, గత రికార్డుల్ని తిరగరాయడం ఖాయమని అనుకున్నారు. తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్-5లో మంచి స్థానమే సంపాదిస్తుందని భావించారు. కానీ.. ఊహించిన రేంజులో ఈ మూవీ వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. ఫస్ట్ డే కేవలం రూ.10.59 కోట్లే వసూలు చేసింది. ఈ దెబ్బకు ‘సరైనోడు’ (రూ.10.49 కోట్లు) రికార్డ్ అయితే బ్రేక్ అయ్యింది కానీ.. టాప్-5లో కాకుండా టాప్-10లో 9 స్థానంతో సరిపెట్టుకుంది.

భారీఎత్తున రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఇంత తక్కువ కలెక్షన్స్ రావడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యంలో మునిగాయి. బహుశా ఇది రీమేక్ మూవీ కావడంతోపాటు డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల కలెక్షన్స్ తక్కువగా వచ్చి ఉండవచ్చునని అంటున్నారు. ఓసారి.. టాలీవుడ్ టాప్-10 ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి..

1. బాహుబలి : 22.11 కోట్లు (1200 స్ర్కీన్లు)
2. సర్దార్ గబ్బర్ సింగ్ : 20.93 కోట్లు (1200 స్ర్కీన్లు)
3. జనతా గ్యారేజ్ : 20.50 కోట్లు (1200 స్ర్కీన్లు)
4. శ్రీమంతుడు : 14.45 కోట్లు (1000 స్ర్కీన్లు)
5. బ్రహ్మోత్సవం : 13.04 కోట్లు (1200 స్ర్కీన్లు)
6. బ్రూస్ లీ : 12.59 కోట్లు (1000 స్ర్కీన్లు)
7. నాన్నకు ప్రేమతో : 12.38 కోట్లు (1100 స్ర్కీన్లు)
8. అత్తారింటికి దారేది : 10.78 కోట్లు (960 స్ర్కీన్లు)
9. ధృవ : 10.59 కోట్లు (1000 స్ర్కీన్లు)
10. సరైనోడు : 10.49 కోట్లు (1000 స్ర్కీన్లు)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news