Moviesరికార్ఢ్ ధరకి ‘ధృవ’ శాటిలైట్ రైట్స్.. చెర్రీ కెరీర్‌లో హయ్యెస్ట్ ఫిగర్

రికార్ఢ్ ధరకి ‘ధృవ’ శాటిలైట్ రైట్స్.. చెర్రీ కెరీర్‌లో హయ్యెస్ట్ ఫిగర్

Gemini TV acquired Dhruva movie satellite rights for fancy price which is record figure in Ram Charan’s career. This movie hits the screen on this friday and doing well at boxoffice.

స్టార్ హీరోల సినిమాలపై సహజంగానే అంచనాలు తారాస్థాయిలో నెలకొంటాయి కాబట్టి.. వాటి రైట్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘ధృవ’ విషయంలోనూ అదే జరిగింది. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఈ చిత్రం విపరీతమైన క్రేజ్ మూటగట్టుకోవడంతో.. భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ శాటిలైట్ హక్కులు కూడా ఫ్యాన్సీ రేటుకే అమ్ముడుపోయాయని తెలిసింది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జెమిని టీవీ ‘ధృవ’ శాటిలైట్ హక్కుల్ని రూ.9.5 కోట్లకు సొంతం చేసుకుంది. చరణ్ కెరీర్‌లో ఇది రికార్డ్ ఫిగర్. తొలుత ఈ మూవీపై ఏర్పడ్డ బజ్ చూసి.. 12-15 కోట్ల మధ్య శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోతాయని ట్రేడ్ నిపుణులు భావించారు. కానీ.. ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఏదేమైనా.. ఇప్పుడొచ్చిన రేటు కూడా సంతృప్తికరమైనది కావడంతో ‘ధృవ’ టీమ్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news