Ram charan’s latest movie Dhruva first day collections are out and the figure is really disappoints mega fans. According to buzz everyone think this will create on firt day but it fails.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘ధృవ’ చిత్రంపై మొదటినుంచి మంచి అంచనాలు నెలకొనడంతో.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావించాయి. పైగా.. ఇది తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’కి రీమేక్ కావడంతో, ఆ క్రేజ్ కూడా కలిసి వస్తుందని, ఈ మూవీతో చరణ్ భారీ రికార్డులు క్రియేట్ చేస్తాడని అనుకున్నారు. అన్నీ ఏరియాల్లో ఈ మూవీపై నెలకొన్న బజ్‌ని బట్టి.. ఇది తొలిరోజు రూ.15-18 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టవచ్చునని ట్రేడ్ నిపుణులు అంచనా కూడా వేశారు. కానీ.. ఈ చిత్రం ఆ అంచనాల్ని ‘ధృవ’ అందుకోలేకపోయింది. ఊహించిన దానికంటే తక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని తొలిరోజు రూ.10.59 కోట్లు మధ్య వసూళ్లు రాబట్టింది. తారాస్థాయి అంచనాల మధ్య భారీఎత్తున రిలీజవ్వడమే కాకుండా తొలిరోజు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ.. ఈ చిత్రం ఇంత తక్కువ కలెక్షన్స్ వసూలు చేయడంతో సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు బద్దలు కొడతాడనుకుంటే.. ఆ దరిదాపుల్లో కూడా చరణ్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. బహుశా ఇది రీమేక్ కావడం వల్లే ఈ చిత్రం ఇంత తక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇక నోట్ల రద్దు ఎఫెక్ట్ కూడా కాస్తౌనా ఉండవచ్చునని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఏదైతేనేం.. కలెక్షనన్ల పరంగా ‘ధృవ’ డిసప్పాయింట్ చేశాడు.
ఏరియాల వారీగా ఫస్ట్ డే కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 3.26
సీడెడ్ : 2.07
వైజాగ్ : 1.32
గుంటూరు : 1.10
వెస్ట్ గోదావరి : 0.90
ఈస్ట్ గోదావరి : 0.85
కృష్ణా : 0.68
నెల్లూరు : 0.41
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ.10.59 కోట్లు