Ram Charan’s latest film Dhruva 13 days collections of Telugu states are out. On 13th day this movie slowed down at the box office. Lets Check out area wise breakup of Dhruva collections.
రెండో వారాంతంలో చెప్పుకోదగిన వసూళ్లు రాబట్టిన ‘ధృవ’ సినిమా.. ఆ తర్వాత వర్కింగ్ డేస్‌లలో అంతంత మాత్రమే రాబడుతోంది. 11వ రోజైన సోమవారం కాస్త ఫర్వాలేదనిపించినా.. మంగళవారం చాలా తక్కువ కలెక్ట్ చేసింది. ఇక 13వ రోజైన బుధవారం అయితే మరీ దారుణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని కేవలం 37 లక్షలే రాబట్టింది. దీంతో.. మొత్తం 13 రోజుల్లో ఈ మూవీ ఏపీ, తెలంగాణలో కలుపుకుని రూ.35.74 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి.
డిమోనిటైజేషన్ ఎఫెక్ట్ వల్లే వర్కింగ్ డేస్‌లలో ఈ మూవీ తక్కువ వసూళ్లు రాబడుతున్నా.. ఓవరాల్‌గా 13 రోజుల్లో 35 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టడం నిజంగా విశేషమని అంటున్నారు. ‘తని ఒరువన్’కి రీమేక్ అయిన ఈ మూవీలో రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించగా.. అరవింద్ స్వామి ఒరిజినల్ క్యారెక్టర్‌నే ఇందులో పోషించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఏరియాల వారీగా ఈ మూవీ కలెక్షన్స్ క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…
నైజాం : 13.21
సీడెడ్ : 5.93
ఉత్తరాంధ్ర : 4.64
గుంటూరు : 3.06
ఈస్ట్ గోదావరి : 2.75
కృష్ణా : 2.6
వెస్ట్ గోదావరి : 2.36
నెల్లూరు : 1.19
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 35.74 కోట్లు (షేర్)