మహేష్-మురుగదాస్ సినిమా యూనిట్‌కి షాకిచ్చిన ‘ఊహించని వ్యక్తి’

mahesh babu murugadoss movie unit shocked with unique person

An unique person shocked the whole team of Mahesh Babu and AR Murugadoss movie in Gujarath.

ప్రిన్స్ మహేష్‌బాబుకి టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా గుర్తించబడ్డ మహేష్‌కి ఆ ఇమేజే అటు బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టింది. భాషతో సంబంధం లేకుండా మహేష్‌ను అభిమానించే వారు ఎందరో ఉన్నారు. అందుకు నిదర్శనగా తాజా సంఘటన నిలిచింది.

మహేష్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఎట్ ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సమీపంలో జరుగుతోంది. యూనిట్ మొత్తం చిత్రీకరణలో బిజీగా ఉండగా.. సెట్‌కి ఓ ఊహించని వ్యక్తి హాజరై అందరికీ పెద్ద షాకిచ్చాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. గుజరాత్ డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్ నితిన్ భాయ్ పటేల్. ఆయన ఒక్కరే కాదండోయ్.. సకుటుంబ సమేతంగా వచ్చారు. సడెన్‌గా ఆయన సెట్‌కి ఎందుకొచ్చారని యూనిట్ ఆలోచనలో ఉండగా.. తాను మహేష్ అభిమానని, కేవలం అతణ్ణి కలుసుకోవడం కోసమే వచ్చానని చెప్పి ఆయన ఆశ్చర్యపరిచారు. మహేష్‌తో కలుసుకోవడమే కాదు.. ఫోటోలు కూడా దిగారు. అలాగే షూటింగ్ జరుగుతున్న తీరుని మురుగదాస్‌ని అడిగి ఆయన తెలుసుకున్నారు.

మహేష్‌బాబు సినిమాలంటే తనకెంతో ఇష్టమని, తన ఫ్యామిలీకి కూడా ఆ సూపర్‌స్టార్ అంటే ఎంతో అభిమానమని నితిన్ భాయ్ పటేల్ తెలిపారు. అందుకే.. తమ అభిమాన హీరో అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుకుంటున్నారని తెలిసి.. ఆయన్ను కలుసుకోకుండా ఉండలేకపోయారట. మహేష్‌ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని నితిన్ భాయ్ పటేల్ అన్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్‌.. ప్రిన్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా ఉందని నిరూపించింది.

mahesh-dy-cm-1

Leave a comment