Aamir Khan’s latest film ‘Dangal’ based on the life of wrestler Mahavir Singh Phogat is shattering all the Indian Box Office records. In just 3 days this movie enters in Rs. 100 Crores club showing hike in revenues from day 1 to day 3.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్‌కి సంబంధించి సినిమా రిలీజైందంటే.. గత రికార్డులన్నీ కొట్టుకుపోవాల్సిందేనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటుంటారు. ఆయన ఎంచుకునే స్ర్కిప్ట్స్ చాలా స్ట్రాంగ్‌గా వుంటాయని, అవి ప్రతిఒక్కరినీ హత్తుకునేలా ఉంటాయని, అందుకే ఆయన మూవీలో బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేస్తాయని అంటుంటారు. అది నిజమేనని మరోసారి ‘దంగల్’ సినిమా నిరూపించింది. తొలిరోజు ఈ చిత్రం కాస్త తక్కువే కలెక్ట్ చేసినా.. శనివారం మాత్రం అంతకుమించే వసూళ్లు రాబట్టింది. ఇక ఆదివారం అయితే మైండ్‌బ్లోయింగ్. ఇంతవరకు ఏ ఇండియాన్ మూవీ కలెక్ట్ చేయని రేంజులో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో.. మూడురోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తొలిరోజైన శుక్రవారం ఈ సినిమా తెలుగు, తమిళ భాషలతో కలుపుకుని దేశవ్యాప్తంగా రూ.29.78 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే ఈ మూవీకి అన్నిచోట్ల నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో.. రెండోరోజైన శనివారంనాడు బాక్సాఫీస్ వద్ద పుంజుకుంది. ఏకంగా రూ.34.82 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడోరోజైన ఆదివారంనాడు ఈ చిత్రం అద్భుతమే సృష్టించింది. అక్షరాల రూ.42.35 కోట్లు వసూలు చేసింది. ఈ మూడు రోజుల లెక్కలు కలుపుకుంటే.. రూ.106.95 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలో మూడోరోజు అంతమొత్తం ఏ చిత్రం కలెక్ట్ చేయలేదు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతోపాటు ఆమీర్ ఖాన్‌కి భారీ ఫాలోయింగ్ ఉన్న కారణంగానే.. ‘దంగల్’ ఇలా ఫస్ట్ వీకెండ్‌లో భారీ వసూళ్లు కలెక్ట్ చేసి, ఆలిండియా రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందని అంటున్నారు.
ఇది కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాబట్టిన అమౌంట్ మాత్రమే. ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ లెక్కల తేలాల్సి ఉంది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందని.. ఫస్ట్ వీకెండ్‌లో రూ.30 కోట్లపైనే కొల్లగొట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి.. ఏ అంచనాలతో అయితే ఈ చిత్రం రిలీజయ్యిందో వాటిని మించే రికార్డ్స్ సృష్టిస్తోంది. అదికూడా డీమోనిటైజేషన్ రోజుల్లో ఇంతమొత్తం కలెక్ట్ చేస్తుండడం నిజంగా విశేషం.
రోజులవారీగా దంగల్ కలెక్షన్స్ (కోట్లలో) :
శుక్రవారం : 29.78
శనివారం : 34.82
ఆదివారం : 42.35
టోటల్ ఫస్ట్ వీకెండ్ : రూ. 106 .95 కోట్లు (షేర్)