Newsఎందచాట... ఆలీ నీకెందుకు ఆ దూల!

ఎందచాట… ఆలీ నీకెందుకు ఆ దూల!

Nowadays Telugu star comedian Ali making a sensational comments on actress. But this time ha made controversial comments which going viral in film industry as well as in Politics.

గాలికి వెళ్లే దాన్ని భుజానికి వేసుకోవడం అంటే ఇదే. సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించి, అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు తెర తీసే కామెంట్లు చేసే కమెడీయన్ అలీ చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కమెడీయన్‌గా చాలా మంది డైరెక్టర్లు, యాక్టర్లకు ఆప్తుడిగా అలీకి మంచి గుర్తింపే ఉంది. అలాంటి అలీ తరుచుగా వార్తల్లో నిలుస్తుండటం ఈ మధ్యన మామూలైపోయింది. ఎవరో ఓ హీరోయిన్‌ను లేదంటే యాంకర్‌ను కాస్త వల్గర్‌గా మాట్లాడటం దాంతో వార్తల్లోకెక్కడం చూస్తున్నాం.

నిజానికి కెరీర్ పరంగా అలీ మీద ఎలాంటి మచ్చలేదు. కానీ.. స్వతహాగా చేస్తున్న తప్పుల కారణంగా కొంత మంది దృష్టిలో చిన్నవాడవుతున్నాడు. ఆ మధ్యన ఓ హీరోయిన్‌ను చూసి ఇదేంట్రా ఇంతుంది అని అన్నాడు. నిజానికి ఆ కామెంట్ కాస్త వల్గర్‌గా ఉన్నా కానీ చాలా మంది పట్టించుకునే వాళ్లు కాదు.. కానీ కామెంట్ చేసిన వ్యక్తి వల్ల దానికి పాపులారిటీ వచ్చింది. ఇక అలీ మామూలుగా చేసే అన్ని షోల్లోనూ ఎక్కడోచోట వల్గర్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండనే ఉంటాయి. ఇందతా ఎందుకు అంటే బహుశా జనాల నోట్లో తన పేరు నానాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉండవచ్చు లేదంటే అనుకోకుండా జరిగి ఉండవచ్చు.

తాజాగా మరోసారి చేసిన వ్యాఖ్యలు ఇటు సినిమా సర్కిల్స్‌లోనూ అటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. గుంటూరులో నిర్వహించిన ఓ ముస్లింల కార్యక్రమానాకి అలీ వెళ్లారు. మామూలుగా అలీ ఎక్కడికి వెళ్లినా అక్కడ కామెడీ పంచ్‌లతో నవ్విస్తారు. కానీ గుంటూరులో మాత్రం పొలిటికల్ హీట్ పుట్టించే పంచ్ వేశారు. ముస్లిం ఓటు బ్యాంకును రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారంటూ కామెంట్లు చేశారు.

కేవలం ఓటింగ్ టైంలో మాత్రమే ముస్లింలు గుర్తుకువస్తారని రాజకీయ కోణంలో కామెంట్ చేశారు. రంజాన్, మొహర్రంనాడు మాత్రమే అందరికి ముస్లింలు గుర్తుకువస్తారు అని, ముస్లింలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే వారికే ఓటువెయ్యాలని ఆయన అందరిని కోరారు. దీంతో అలీ పొలిటికల్ ఎంట్రీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. అలీకి పొలిటికల్ మైలేజ్ కింద ముస్లింల ఓట్లు కలిసి వస్తాయి అన్న నమ్మకంతోనే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. అలీ నిజంగా ముస్లింల ఉన్నతి కోరుకునే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు కానీ తాను ఉన్న పరిస్థితిలో ఎలాంటి కామెంట్ చేయకుండా ఉండటం ఉత్తమం. ఎందుకు అంటే అలీ ఇలా ఓ పక్షాన మాట్లాడటం వల్ల కొందరివాడు అయ్యే ఛాన్సులు ఉన్నాయి. దాని వల్ల అతడి కెరీర్(అది సినిమా కావచ్చు లేదంటే రాజకీయం కావచ్చు)మీద ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కాబట్టి అలీ నాలుకను కాస్త అదుపులో ఉంచుకుంటే మంచిదని చాలామంది అభిప్రాయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news