Movies లీకైన ‘కాటమరాయుడు’ టైటిల్ సాంగ్.. నెట్టింట్లో హల్‌చల్

లీకైన ‘కాటమరాయుడు’ టైటిల్ సాంగ్.. నెట్టింట్లో హల్‌చల్

Powerstar Pawan Kalyan is doing movie under Kishores Parthasani direction which is titled as Katamarayudu. This movie shooting going process on ramoji film city. It will took 4 to 5 months for release of this film. But before that title song has leaked and going viral on social media. It is not confirmed yet who released this on internet.

లీకేజీరాయుళ్లు నిజంగానే లీక్ చేస్తారో లేక యూనిట్ వర్గాలే తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం లీక్ చేసుకుంటారో తెలీదు కానీ.. ఈమధ్య ఇండస్ట్రీలో లీకేజీ బాగోతం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఫోటోల దగ్గర నుంచి డైలాగులు, పాటలు.. ఏకంగా సినిమాలే రిలీజ్‌కి ముందు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా.. స్టార్ హీరోల సినిమాలే దీని బారిన పడుతున్నాయి.

అప్పట్లో ‘అత్తారింటికి దారేది’, ‘బాహుబలి ది బిగినింగ్’ సినిమాలు రిలీజ్‌కి ముందే లీకవ్వడంతో పెద్ద రాద్ధాంతమే జరిగింది. దాంతో.. ఇండస్ట్రీ వర్గాలు కఠినమైన చర్యలు తీసుకున్నారు. అయినా.. ఈ లీకేజీ బెడద తప్పడం లేదు. రీసెంట్‌గానే.. ‘బాహుబలి-2’ మూవీలోని వార్ సీన్లు బయటకు వచ్చేశాయి. ఇక తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’ కూడా దీని బారిన పడింది. కిషోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉన్నా.. అప్పుడే టైటిల్ సాంగ్ లీకపోయింది.

‘అరె అదిగో అదిగో చూడు.. ఓ సైనికుడు వస్తున్నాడు’ అంటూ సాగే ఈ పాట మొత్తం 4 నిముషాల నిడివితో ఉంది. ఈ పాట లిరిక్స్, మ్యూజిక్ అదిరిపోయాయి. వినసొంపుగా ఉన్న ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మీరూ ఓసారి విని, ఎంజాయ్ చేయండి.

https://youtu.be/js4Vrej_zIc

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news